ETV Bharat / state

పని చేయించి... వేతనాలివ్వడం లేదు! - undefined

కృష్ణా జిల్లా గొట్టుముక్కల ప్రాంతంలో.. ఒడిశాకు చెందిన బాలకార్మికులతో వెట్టిచాకిరీ చేయిస్తున్న వ్యవహారం బయటపడింది. పిల్లలతో బలవంతంగా పని చేయిస్తున్న ఇటుక బట్టీ నిర్వాహకుల నిర్వాకంపై.. కార్మిక శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు.

పని చేయించి... వేతనాలివ్వడం లేదు!
author img

By

Published : Apr 18, 2019, 10:39 AM IST

Updated : Apr 19, 2019, 7:23 AM IST

ఒరిస్సా నుంచి బాలకార్మికులను తీసుకువచ్చి వెట్టిచాకిరీ చేయిస్తున్న ఇటుకబట్టీల యాజమాన్యంపై కార్మికశాఖ కమిషనర్‌ ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఒరిస్సానుంచి 35మంది బాలకార్మికులను తీసుకువచ్చి కంచికచర్ల మండలం గొట్టెముక్కల గ్రామంలో ఇటుకబట్టీల్లో పనులు చేయిస్తున్నారు. వారికి కనీస వేతనం ఇవ్వకపోవడంతోపాటు రాత్రింబవళ్లు పనిచేయించుకుంటున్నారు. ఇక్కడ పనిచేస్తున్న బాలకార్మికుడు పురుషోత్తమకుమార్‌ ఒరిస్సాలోని కార్మికశాఖ కార్యాలయాన్ని సంప్రదించి ఫిర్యాదు చేశారు. అనంతరం ఒరిస్సా రాష్ట్ర అధికారులు ఆంధ్రప్రదేశ్‌ కార్మికశాఖ అధికారులకు సమాచారం అందించడంతో దాడులు నిర్వహించారు.

కనీసం అనారోగ్యానికి గురైనా తమకు వైద్య సదుపాయం సైతం అందించకుండా...తమతో యాజమాన్యం పనిచేయించుకుంటోందని వారు ఆరోపించారు. కార్మికశాఖ కమిషనర్‌ ఆంజనేయరెడ్డితోపాటు ఒరిస్సా కార్మికశాఖ అధికారిణి భాగ్యశ్రీ నందిగామ సహాయ కమిషనర్‌ మహేశ్వరరెడ్డి ఇటుక బట్టీ యాజమాన్యంపై కేసులు నమోదుచేశారు. 35మంది బాలకార్మికులకు రవాణ ఖర్చును అందచేసి వారి స్వస్థలాలకు పంపించారు.

Solapur (Maharashtra), Apr 18 (ANI): The voting for second phase of 17th Lok Sabha elections is underway across India today. Congress leader Sushilkumar Shinde cast his vote at a polling station in Maharashtra's Solapur along with his wife. "Voters will correct their mistake this time", said Shinde. Shinde is Congress' candidate from Solapur. People of India will exercise their right to vote across nation in 11 states and one union territory. Voting is underway for 95 Parliamentary seats. Security arrangements have been tightened at all the polling stations. The third phase of LS polls will be held on April 23.
Last Updated : Apr 19, 2019, 7:23 AM IST

For All Latest Updates

TAGGED:

child labour
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.