మచిలీపట్నంలో ఏర్పాటుచేసిన 'చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్'ను.. కృష్ణాజిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ప్రారంభించారు. పోలీసులు అంటే చిన్నారుల్లో సహజంగా ఉండే భయాన్ని తొలగించే దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసమే పోలీసు వ్యవస్థ ఉందన్న భావన కల్పించే దిశగా పనిచేస్తున్నామన్నారు.
ముఖ్యమంత్రి, ఉన్నతాధికారుల ఆదేశాలతో.. గుడివాడ వన్‌టౌన్‌లోనూ ఈ విభాగాన్ని ప్రారంభిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. త్వరలోనే జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో బాలల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని వివరించారు.
ఇదీ చదవండి: ఉరిమిన కడలి.. కకావికలమైన దివిసీమ...