ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ - Dental treatment

Family Doctor policy : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోవైపు వైఎస్ఆర్ కంటివెలుగు మూడో దశ కార్యక్రమాన్ని సీఎం వర్చువల్​గా ప్రారంభించారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 6, 2023, 7:35 PM IST

Updated : Mar 7, 2023, 6:19 AM IST

Family Doctor policy : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈమేరకు వైద్యారోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. మరోవైపు వైఎస్ఆర్ కంటివెలుగు మూడో దశ కార్యక్రమాన్ని సీఎం వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల నిర్మాణంపైనా సీఎం ఆరా తీశారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరలోనే దంతచికిత్సకు సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందించాలని సీఎం సూచించారు.

వైద్యుల నియామకాలు పూర్తి... రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 తేదీ నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా వైద్యారోగ్యశాఖను ఆయన ఆదేశించారు. మార్చి 15వ తేదీన ఓ విలేజ్ క్లినిక్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించారు. పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 45.90 లక్షల మందికి ఆరోగ్యసేవలు అందించినట్టుగా అధికారులు వివరించారు. మొత్తం 1,149 పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయిలో వైద్యుల నియమాకాలను పూర్తి చేసినట్టు అధికారులు వివరించారు.

పీహెచ్​సీలు, అంబులెన్స్ అనుసంధానం.. 10,032 విలేజ్‌హెల్త్‌ క్లినిక్స్‌లో ప్రతి క్లినిక్‌కూ ఒక ఏఎన్‌ఎం చొప్పున ఉంటారని సీఎంకు తెలిపారు. అలాగే 104 వాహనాల్లో ఉంచే మందుల సంఖ్యను కూడా పెంచినట్టు వివరించారు. ప్రస్తుతం 14 రకాల డయాగ్నోస్టిక్‌ కిట్లను కూడా విలేజ్‌క్లినిక్స్‌కు అందుబాటులో పెట్టామని వైద్యారోగ్యశాఖ సీఎంకు వివరించింది. పీహెచ్‌సీలను, 104 అంబులెన్స్‌లను అనుసంధానం చేస్తూ మ్యాపింగ్‌ కూడా పూర్తి చేశామని అధికారులు వివరించారు. ప్రస్తుతం 676 వాహనాలు (104) సేవలు అందిస్తున్నాయని కొత్తగా మరో 234 వాహనాలు ఫ్యామిలీ డాక్టర్‌ విధానం కోసం వినియోగించనున్నట్టు తెలియజేశారు. ఒక వైద్యుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సేవలు, మరో వైద్యుడు ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం కోసం అందుబాటులో ఉంటారన్నారు. జనరల్‌ ఓపీ, గర్భవతుల ఆరోగ్య రక్షణ, అంగన్‌వాడీల సందర్శన, అందులో పిల్లల ఆరోగ్యంపై పరిశీలన, స్కూళ్ల సందర్శన, అందులోని పిల్లల ఆరోగ్యంపై పరిశీలన, రక్తహీనత నివారణపై దృష్టి, మంచానికే పరిమితమైన పేషెంట్ల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తారని వైద్యారోగ్యశాఖ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్పెషలిస్టు డాక్టర్ల ద్వారా టెలిమెడిసన్‌ పద్ధతుల్లో కూడా వీరికి సేవలందించేలా చూస్తారని స్పష్టం చేశారు. గ్రామాల్లో అసంక్రమిత, బీపీ, మధుమేహం లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారి సమాచారాన్ని కూడా ప్యామిలీ డాక్టర్లు తీసుకుంటారని తెలిపారు.

కంటి చికిత్సలు షురూ.. ఆరోగ్య శ్రీ రిఫరల్ సేవలు కూడా ఫ్యామిలీ డాక్టర్ విధుల్లో భాగం కావాలని సీఎం ఆదేశించారు. రక్తహీనతకు సంబంధించిన కేసులను సంపూర్ణ పోషణ కార్యక్రమానికి అనుసంధానించాలన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కంటి చికిత్సల కార్యక్రమాన్ని సీఎం వర్చువల్​గా ప్రారంభించారు. ఈ తరహాలోనే దంతపరీక్షలు నిర్వహించడంపైనా దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. దీనికోసం కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. మరోవైపు ఏపీలో కొత్తగా నిర్మిస్తున్న వైద్య కళాశాల గురించీ సీఎం ఆరా తీశారు. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలల్లో 2023-24 నుంచే తరగతులు ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 108 కోసం 146 వాహనాలను కొనుగోలు చేయనున్నట్టు సీఎం స్పష్టం చేశారు.

ఇవీ చదవండి :

Last Updated : Mar 7, 2023, 6:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.