జర్నలిస్టు నాగార్జున రెడ్డిపై జరిగిన దాడితో తనకు ఎలాంటి సంబంధం లేదని వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ స్పష్టం చేశారు. దాడి చేయాల్సిన అవసరం తనకు లేదని.. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని చంద్రబాబు నాయుడు డీజీపీకి లేఖ రాయడం తెదేపా దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు. చంద్రబాబు చెబుతున్నట్లు నాగార్జునరెడ్డి జర్నిలిస్టు కాదని అన్నారు. దాడి ఘటనకు సంబంధించి పోలీసులు 12 మంది అనుమానితులను ఇప్పటికే అరెస్టు చేశారని తెలిపారు.
ఇదీ చూడండి: