'మీరు లక్కీ డ్రాలో డబ్బులు గెలిచారు. ఆన్లైన్లో డబ్బులు చెల్లించి బహుమతి గెలుచుకోండి'. ఇది సైబర్ నేరగాళ్ల పాత తరహా దోపిడీ విధానం. ఇప్పుడు వారూ అప్డేట్ అయ్యారు. ప్రముఖ కంపెనీల పేర్లతో నయా దోపిడీకి తెర తీశారు. ఆన్లైన్లో వస్తువుల కొన్న వారి వివరాలు సేకరించి.. వినియోగదారులకు ఫోన్ చేసి వారు కొన్న వస్తువుల వివరాలు తెలిపి బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా ఈ తరహా నేరాలు అధికమవుతున్నాయి.
విజయవాడకు చెందిన శ్రీనివాస చక్రవర్తి అనే వ్యక్తి ఫ్లిప్‌కార్ట్‌లో టీవీ కొన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ సంస్థ పేరుతో ఓ ఫోన్ వచ్చింది. 'టీవీ కొన్నందుకు లక్కీడ్రాలో బహుమతి గెలుచుకున్నారని.... 3వేలు చెల్లిస్తే.. బహుమతి సొంతమవుతుందని' నమ్మించారు. ట్రూకాలర్లోనూ చూస్తే ఫోన్ నెంబర్ ఫ్లిప్‌కార్ట్ పేరుతోనే ఉండేసరికి మాయ మాటలు నమ్మేశారు చక్రవర్తి. చెప్పిన ఖాతాకు నగదు బదిలీ చేశారు. ఫోన్ సందేశం వేరే ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఖాతాకు నగదు బదిలీ అయినట్టు సమాచారం వచ్చింది. అనుమానంతో ఫ్లిప్‌కార్ట్‌కు ఫోన్ చేస్తే.. అదంతా ఫేక్ అని తేల్చారు. అవాక్కై బ్యాంకును సంప్రదించేసరికే డబ్బు బదిలీ అయింది. బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇలా ఎప్పటికప్పుడు నేరాలలో కొత్త పంథా వెతుక్కుంటూ.. ప్రముఖ కంపెనీల పేరుతో మోసం చేస్తున్న వారితో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.
ఇవీ చదవండి..