ETV Bharat / state

అంబులెన్స్ ఢీ.. అనంతలోకాలకు ఛత్తీస్​గఢ్ యువకుడు! - nandigama ambulance hit news

పొట్ట కూటి కోసం రాష్ట్రాన్ని దాటుకొని వచ్చాడు... ఉపాధి కోసం వెళ్తూ.. రోడ్డు దాటబోయాడు. మృత్యువులా దూసుకొచ్చిన 108 వాహనం.. అతన్ని ఢీ కొట్టింది. రోగులను ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడే ఆ వాహనం.. ఈ యువకుడిని మాత్రం అనంతలోకానికి పంపించింది. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా నందిగామలో జరిగింది.

person died due to ambulance hit
అంబులెన్స్ ఢీకొట్టి వ్యక్తి మృతి
author img

By

Published : Jan 5, 2021, 12:16 PM IST

Updated : Jan 5, 2021, 12:40 PM IST

అంబులెన్స్ ఢీకొట్టి వ్యక్తి మృతి

కృష్ణా జిల్లా నందిగామకు.. ఛత్తీస్ గఢ్ నుంచి ఓ యువకుడు ఉపాధి నిమిత్తం వచ్చాడు. ఓ బోర్​ వెల్ కంపెనీలో పని చేసేందుకు.. ఆదివారం రాత్రి నందిగామ చేరుకున్నాడు. ఒక్క రోజు గడిచిందో లేదే.. మృత్యువాత పడ్డాడు. అంబులెన్స్ రూపంలో తరుముకు వచ్చిన మృత్యువు.. అతడి ప్రాణం తీసింది. నందిగామలో రోడ్డు దాటుతున్న ఆ యువకుడిని.. విజయవాడ వైపు వెళ్తున్న 108 వాహనం ఢీ కొట్టగా.. గాల్లో పల్టీలు కొడుతూ రహదారిపై పడి తీవ్ర గాయాలపాలయ్యాడు.

ఆసుపత్రికి తరలించినా.. ఆగిపోయిన శ్వాస

తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు ఛత్తీస్​ఘడ్ రాష్ట్రం భీజాపూర్ జిల్లా నల్సార్​ గ్రామానికి చెందిన కడెం సుద్రూ (31) గా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

'పెట్టుబడుల సదస్సులకు బదులుగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు'

Last Updated : Jan 5, 2021, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.