దివ్యాంగులు ఇతరులతో సమానంగా జీవించే హక్కు, భద్రత, గౌరవం అందుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో అన్నిరంగాలలో ముందుకెళ్లేందుకు అండగా నిలబడతామని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రతినబూనాలని పిలుపునిచ్చారు. దివ్యాంగులు పలురంగాల్లో ప్రతిభ కనబరుస్తూ... లక్ష్యాన్ని సాధించడంలో, ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో ఎవరికి తక్కువ కాదని చాటుతున్నారన్నారు. దేశచరిత్రలో తొలిసారి ఐఏఎస్‌కు ఎంపికైన అంధ మహిళ ప్రాంజల్ పాటిల్ ఇందుకు ఒక ఉదాహరణ అని ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించారు.
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తెదేపా కేంద్ర కార్యాలయంలో పెద్ద సంఖ్యలో దివ్యాంగులు చంద్రబాబును కలిశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మూడు చక్రాల వాహనాలను చంద్రబాబు ముందు ప్రదర్శనగా పెట్టారు. చంద్రబాబు ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ... వారితో ఫొటోలు దిగారు.
ఇదీ చూడండి. పేర్నిపై దాడి ప్రభావం.. కొడాలి ఇంట్లో భద్రత కట్టుదిట్టం