Chandrababu tweet on CM Jagan's London Tour : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వేసుకునే చెప్పుల ధర లక్షా 34వేలకు పైమాటే.. ఆయన తాగే 750ఎం.ఎల్. వాటర్ బాటిల్ ఖరీదు రూ.5500. ఒక్క రూపాయి వేతనం మాత్రమే తీసుకునే ముఖ్యమంత్రి జగన్.. పర్యటన అంటే హంగామా అంతా ఇంతా కాదు. 2, 3 కిలోమీటర్ల దూరంలోని సభలకూ హెలికాప్టర్లలో వెళ్తూ ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తుంటారు. తాజాగా లండన్ పర్యటనకు సొంతంగా విమానం ఏర్పాటు చేసుకోవడం.. జగన్ విలాస జీవితానికి అద్దం పడుతోంది.
రూ.43కోట్ల ఖర్చు.. ముఖ్యమంత్రి జగన్.. లండన్‌లో ఉన్న కూతుళ్లను చూసేందుకు అత్యంత విలాసవంతమైన విమానంలో వెళ్లడం విమర్శలకు తావిస్తోంది. సీఎం జగన్ దంపతులు పది రోజుల విదేశీ పర్యటనకు ‘ఎంబ్రాయెర్ లినేజ్ 1000’ అనే విమానాన్ని ఎంగేజ్ చేసుకున్నారు. రూ.435 కోట్ల విలువైన ఆ విమానంలో.. గంటకు సుమారు 14 వేల 850 డాలర్ల (రూ.2 లక్షల 71 వేలు) అద్దె చెల్లించి సుమారు 19 మంది వరకూ ప్రయాణించొచ్చు. కాగా, సీఎం పర్యటనకు రూ.43 కోట్లు ఖర్చు కానుంది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు.
'నాకేటి సిగ్గు నవ్విపోదురుగాక' అన్న రీతిలో సీఎం జగన్ తీరు
వైద్యం కోసం వెళ్లాలన్నా డోలీలే దిక్కు.. ''మన్యం ప్రాంతాల్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే, వారిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలంటే డోలీలే దిక్కువవుతున్నాయి. నిన్న కూడా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని మర్రిపాడు పంచాయతీలో, విజయనగరం జిల్లా లోతుగెడ్డ పంచాయతీలో డోలీల్లోనే మోసుకెళ్లారు. గతంలో రోజుకు రూ.2100 నిర్వహణ ఖర్చుతో ఫీడర్ అంబులెన్సులు పెట్టి గిరిజనులను ఆదుకున్నాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మన పేద ముఖ్యమంత్రి మాత్రం లండన్ టూర్ కి రూ.43 కోట్లు ఖర్చుచేస్తాడు. 2 కిలోమీటర్లు వెళ్లాలన్నా అతగాడికి హెలికాఫ్టర్ కావాలి. ఆయన తప్ప మిగతా వారు మనుషులు కాదని ఆయన ఫీలింగ్!'' అని పేర్కొన్నారు.
-
మన్యం ప్రాంతాల్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే, వారిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలంటే డోలీలే దిక్కువవుతున్నాయి. నిన్న కూడా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని మర్రిపాడు పంచాయతీలో, విజయనగరం జిల్లా లోతుగెడ్డ పంచాయతీలో డోలీల్లోనే మోసుకెళ్లారు. గతంలో రోజుకు రూ.2100 నిర్వహణ ఖర్చుతో ఫీడర్ అంబులెన్సులు… pic.twitter.com/MCnpfVR3va
— N Chandrababu Naidu (@ncbn) September 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">మన్యం ప్రాంతాల్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే, వారిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలంటే డోలీలే దిక్కువవుతున్నాయి. నిన్న కూడా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని మర్రిపాడు పంచాయతీలో, విజయనగరం జిల్లా లోతుగెడ్డ పంచాయతీలో డోలీల్లోనే మోసుకెళ్లారు. గతంలో రోజుకు రూ.2100 నిర్వహణ ఖర్చుతో ఫీడర్ అంబులెన్సులు… pic.twitter.com/MCnpfVR3va
— N Chandrababu Naidu (@ncbn) September 8, 2023మన్యం ప్రాంతాల్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే, వారిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలంటే డోలీలే దిక్కువవుతున్నాయి. నిన్న కూడా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని మర్రిపాడు పంచాయతీలో, విజయనగరం జిల్లా లోతుగెడ్డ పంచాయతీలో డోలీల్లోనే మోసుకెళ్లారు. గతంలో రోజుకు రూ.2100 నిర్వహణ ఖర్చుతో ఫీడర్ అంబులెన్సులు… pic.twitter.com/MCnpfVR3va
— N Chandrababu Naidu (@ncbn) September 8, 2023
ఇదేం న్యాయం జగన్ రెడ్డీ.. ప్రజాధనం 43 కోట్లు ఖర్చుచేసి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లిన దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం జగన్ రెడ్డి పెత్తందారు కాక మరీ ఏమిటనీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. ఒక వైపు కరెంట్ కోతలు, మరోవైపు ఉద్యోగులకి జీతాలు లేని పరిస్థితిలో రాష్ట్రమంతా సమస్యల సుడిగుండంలో ఉందని గుర్తు చేశారు. పేదలు దుర్భర జీవితం గడుపుతుంటే.. జగన్ లండన్ ఫ్లైట్ ఖర్చు రూ.43 కోట్లు అంటూ ధ్వజమెత్తారు. తనని సీఎం చేసిన ప్రజలేమో రోడ్ల మీద బురద గుంటల్లో పడుతూ లేస్తూ పనికి పోవాలని ఆక్షేపించారు. తను మాత్రం ఆ కష్ఠజీవుల డబ్బుతో ఖరీదైన విమాన ప్రయాణాల్లో షికారుకు వెళ్లడం.. ఇదేం న్యాయం జగన్ రెడ్డీ అంటూ లోకేశ్ ప్రశ్నలు సంధించారు.