ETV Bharat / state

నా నివాసాన్ని ప్రభుత్వం టార్గెట్​ చేస్తోంది: చంద్రబాబు

ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో చంద్రబాబు మండిపడ్డారు. నా ఇంటిని ప్రభుత్వం టార్గెట్​ చేస్తుందని ఆరోపించారు. వరద సహాయక చర్యలు చేపట్టటంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు

చంద్రబాబు
author img

By

Published : Aug 16, 2019, 4:33 PM IST

పేదల పొట్టకొట్టే చర్యలకు వైకాపా నేతలు పాల్పడటం అమానుషమని తెదేపా నేతల టెలీ కాన్ఫరెన్స్​లో చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వం తన నివాసాన్ని టార్గెట్ చేస్తోందని.. తన భద్రతపై ఆటలాడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. తన భద్రతపై కోర్టుకెళ్లాల్సిన పరిస్థితి తెచ్చారని చెప్పారు. మా ఇంటిపైకి డ్రోను కెమెరాలను పంపటమేంటని ప్రశ్నించారు. డ్రోన్లు పంపటానికి కిరణ్ అనే వ్యక్తి ఎవరు అని మండిపడ్డారు. సీఎం జగన్ ఇంటిపై కూడా డ్రోన్లు నడుపుతారా అని ఎద్దేవా చేశారు. తెదేపా నేతలపై దాడులు చేస్తున్నారని... చిరుద్యోగులను వేధించి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దల పొట్టకొట్టే చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు.

వరద సహాయక చర్యలు చేపట్టటంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు అన్నారు. బాధితులను ఆదుకోలేకపోయారని విమర్శించారు. వరద నిర్వహణ కార్యక్రమాలు చేపడితే నీళ్లు వచ్చేవి కాదన్నారు. ప్రభుత్వం ఒక్కసారైనా వరద నిర్వహణపై సమీక్ష చేయలేదని ఆరోపించారు. మన రాష్ట్రంలో వర్షాలు లేకపోయినా.. పక్కరాష్ట్రాల్లో కురిసిన వానలతో వరదలొచ్చాయని చెప్పారు. ప్రాజెక్టులో 3 లక్షల క్యూసెక్కుల నీటిని ముందే వదిలి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. తనపై అక్కసుతో ప్రజలను వరదల్లో ముంచుతున్నారని ధ్వజమెత్తారు. నీళ్లు నిల్వ ఉంచి.. అకస్మాత్తుగా విడుదల చేయడమేంటని ప్రశ్నించారు. ముంపు బాధితులకు వరద సహాయక చర్యలు చేపట్టలేదన్నారు. కనీసం వాళ్లను పట్టించుకున్నవారే లేరని తెలిపారు.

ఇది కూడా చదవండి.

"డ్రోన్ ప్రయోగం వైకాపా ప్రభుత్వం కుట్ర"

Intro:ap_gnt_81_16_anna_kyanteen_vaddhar_tdp_dharna_avb_ap10170

పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ ను తెరవాలి: చదలవాడ అరవింద బాబు, నరసరావుపేట తెదేపా ఇంచార్జి.

వేకువజామున లేచి పనులకు వెళ్లే నిరుపేదల కోసం గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తరువాత సీఎం జగన్మోహన రెడ్డి నేతృత్వంలో మూసివేయడం సరి కాదని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేటలో అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం మూసియించిన కారణంగా పల్నాడు బస్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్ వద్ద నిరసనగా చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో శుక్రవారం తెదేపా నాయకులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో అరవింద బాబు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీద కక్ష ఉంటే దాని కోసం పేద ప్రజల కడుపు కొట్టడం జగన్మోహనరెడ్డి కి సమంజసం కాదన్నారు.

Body:అన్నా క్యాంటీన్ రంగు నచ్చకపోతే మార్చుకోవాలి కానీ మూసివేయడం తగదన్నారు. పేదవారికి పట్టడన్నం పెట్టాలి అన్న ఎన్టీఆర్ కలలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. ప్రస్తుతం రోజువారీ కార్మికులకు ఇసుక సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమై పనులు లేక పూటగడవని పేదలకు అన్నా క్యాంటీన్ ముడు పూటలా కేవలం 15 రూపాయలతో కడుపు నింపుతుంటే అది చంద్రబాబుకు పేరు తెస్తుందనే ఉద్దేశ్యంతో జగన్మోహన రెడ్డి ఈ పధకాన్ని నిలిపివేశారని ఆయన ఎద్దేవా చేశారు.

Conclusion:రాష్ట్రవ్యాప్తంగా తెదేపా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలని అరవింద బాబు డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం పేద ప్రజలకు పులిహోరా పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

బైట్: చదలవాడ అరవింద బాబు, నరసరావుపేట తెదేపా ఇంచార్జి.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.