స్థానిక సంస్థల ఎన్నికలపై తెదేపా శ్రేణులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 38ఏళ్ల తెదేపా చరిత్రలో ఎన్నో ఎన్నికలు సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరోచితంగా పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అన్ని చోట్ల స్ఫూర్తిదాయక నాయకత్వం ఇవ్వాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటం చేసి, వైకాపా వాళ్ల కథ తేల్చాలని అన్నారు. 2,800 మందిపై కేసులు పెట్టినా ధైర్యంగా పోరాడుతున్న ఆడబిడ్డలని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడమే అందరి లక్ష్యమని ఉద్ఘాటించారు. పేదల సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసి.. సీఏఏ, ఎన్‌పీఆర్‌పై జగన్నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఓటమి భయంతోనే మంత్రుల ఉద్యోగాలు పీకేస్తానని సీఎం జగన్ బెదిరించారని విమర్శించారు. ఈ సమావేశంలో అన్ని మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : మనమున్నది ప్రజాస్వామ్యంలోనా.. నియంత రాజ్యంలోనా..?'