ETV Bharat / state

CBN Tour : రాష్ట్ర భవిష్యత్​ కోసం పోరాడేందుకు సిద్ధం కావాలి : చంద్రబాబు - టీడీపీ

Chandrababu Krishna District Tour : రాష్ట్రంలో గంజాయి కల్చర్​ పెరిగిపోతోందని.. రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్​ ఉండదని టీడీపీ అధినేత చంద్రాబాబు ఆరోపించారు. ఈ కల్చర్​ను రాష్ట్రం నుంచి తొలగించటానికి తనతో కలిసి పోరాడేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు

Chandrababu
చంద్రబాబు
author img

By

Published : Apr 14, 2023, 8:04 PM IST

Updated : Apr 15, 2023, 6:11 AM IST

Chandrababu Road Show at Gudivada : తులసి వనం లాంటి ఆంధ్రప్రదేశ్​లో గంజాయి మొక్కలు పెరిగిపోతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్రమంతటా గంజాయి సంస్కృతి విస్తరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే ఎవ్వరికీ భవిష్యత్​ ఉండదని అన్నారు. టీడీపీ అధినేత కృష్ణా జిల్లాలో చేపట్టిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. చంద్రబాబు గుడివాడలో పాల్గొన్న రోడ్​ షోలో జనసేన, జై భీమ్ శ్రేణుల సందడి కనిపించిది. జనసేన నేతలు ఆ పార్టీ జెండాలతో సందడి చేశారు. అంతేకాకుండా జై భీమ్ పార్టీ నాయకులు తమ పార్టీల జెండాలు ఊపుతూ మద్దతు తెలిపారు. గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్​లో చంద్రబాబుకు టీడీపీ పార్టీ శ్రేణులు, నేతలు ఘనంగా స్వాగతం పలికారు. క్రేన్​ సహాయంతో భారీ గజమాలతో ఆయనను సత్కరించారు. అనంతరం హనుమాన్​ జంక్షన్​లోని అంజనేయ స్వామి వారి ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర బిడ్డల, భవిష్యత్​ కోసమే తన పోరాటమన్న ఆయన.. భవిష్యత్​ తరాల కోసం కలిసి పోరాడేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

గుడివాడ నుంచి నూజివీడుకు : గుడివాడ హనుమాన్​ జంక్షన్​ గుండా రోడ్​ షో ద్వారా ముందుకు కదిలారు. రోడ్​ షోలో భారీగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు. అక్కడి నుంచి ముందుకు సాగిన టీడీపీ అధినేత.. నూజివీడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. సభలో ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి గన్నవరం బయల్దేరనున్నారు. నేటితో చంద్రబాబు తలపెట్టిన మూడు రోజుల కృష్ణా జిల్లా పర్యటన ముగియనుంది.

సాయి కళ్యాణి కుటుంబ సభ్యుల పరామర్శ : ఇటీవల హనుమాన్ జంక్షన్​లో పోలీసులు అరెస్ట్‌ చేసిన తెలుగు మహిళ కార్యదర్శి మూల్పూరి సాయి కల్యాణి కుటుంబ సభ్యులను తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరామర్శించారు. అరెస్టై జైల్లో ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. హత్యాయత్నం కేసు పెట్టి కళ్యాణిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఇంటికి వెళ్లిన టీడీపీ అధినేత.. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు.

ఇవీ చదవండి :

Last Updated : Apr 15, 2023, 6:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.