chandrababu fire on cm jagan : సైకో పాలనలో రాష్ట్రం సర్వ నాశనమైపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. రాష్ట్రం భవిష్యత్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. సీనియర్ రాజకీయ నేత కన్నా లక్ష్మీనారాయణ.. ఎన్టీఆర్ భవన్లో టీడీపీలో చేరిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. పార్టీ కండువా కప్పి ఆయనను సాదరంగా ఆహ్వానించారు.
అధికారానికి అడ్డం వచ్చినందుకే వివేకా హత్య... బాబాయ్ హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి గూగుల్ టేక్ అవుట్లో అడ్డంగా దొరికిపోయాడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. "హూ కిల్డ్ బాబాయ్..?" ప్రశ్నకు "అబ్బాయ్ కిల్డ్ బాబాయ్" అని సీబీఐ ఆఫిడవిట్ సమాధానమిస్తోందని వెల్లడించారు. బాబాయ్‌ని చంపాక ఆనాడు ఆడిన నాటకం ఎవరి ఊహకూ అందదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి నాటకాలు నమ్మి ఓ నరహంతకుడికి ప్రజలు ఆనాడు ఓట్లేశారన్న చంద్రబాబు.. అధికారానికి అడ్డం వచ్చినందుకే వివేకానంద రెడ్డి హత్య జరిగిందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వమని వివేకా పట్టుబట్టినందుకే హత్య చేసి అడ్డు తొలగించుకున్నారని విమర్శించారు. బాబాయ్‌నే చంపించిన వ్యక్తి వల్ల రాష్ట్ర ప్రజలకు భద్రత ఉంటుందా..? అని చంద్రబాబు ప్రశ్నించారు.
తాడేపల్లి ప్యాలెస్ మీదుగా రోడ్డు వేయలేమా.. మధ్యంతర ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఐపీసీ యాక్ట్ బదులు వైఎస్సార్సీపీ యాక్ట్ అమలవుతోందని ఆక్షేపించారు. గన్నవరం పార్టీ కార్యాలయం విధ్వంస ఘటనలో సీఐ కనకారావుతో అక్రమ కేసు పెట్టించారని విమర్శించారు. రహదారి విస్తరణ పేరిట ఇప్పటంలో ఇళ్లు కూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక తాడేపల్లి ప్యాలెస్ మీదుగా రహదారి విస్తరణ వేయలేమా అంటూ చంద్రబాబు ప్రస్తావించారు.
వ్యవస్థలపై దాడులా..? సైకో పాలనలో ప్రజలంతా పేదలవుతుంటే, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇంకా ధవవంతుడు అవుతున్నాడని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రులుగా చేసిన వారిలో కొందరు అవినీతిపరులు, మరికొందరు అసమర్థులున్నారు కానీ జగన్మోహన్ రెడ్డిలా విధ్వంసానికి పాల్పడిన వారు కాదని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి అయినా మంచిపేరు తెచ్చుకునేందుకు తపిస్తాడు.. అంతే తప్ప.. వ్యవస్థలపై దాడులు చేయబోరు అని. చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి :