ఉద్యాన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదంటూ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. లేనిపోని అవాస్తవాలతో రైతులను చంద్రబాబు గందరగోళపరుస్తున్నారని మంత్రి ఆరోపించారు. తెదేపా హయాంలో ఏ ఒక్క పంటకు సరైన మద్దతు ధర దక్కలేదని ఆయన విమర్శించారు. తెదేపా హయాంలో ఏ రోజూ రైతుల గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు వారి గురించి మాట్లాడడం శోచనీయమన్నారు.
ఇవీ చదవండి