కృష్ణా జిల్లా నందిగామ మాజీఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటిపై వైకాపా గుండాల దాడి పిరికిపంద చర్య అని... తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆక్షేపించారు. దాడిని ఖండించిన ఆయన... రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. పోలీసుల సహకారంతోనే మహిళా నేత ఇంటిపైకి 40 మంది రౌడీలు వెళ్లగలిగారని ఆరోపించారు. నందిగామ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన సౌమ్య ఇంటిపై దాడి హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. బాధ్యులపై చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని వైకాపా నేతలు ఖూనీ చేశారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి...