కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఉమ్మద దేవరపల్లిలో నీటి కోసం జనావాసాల మధ్యకు వచ్చిన చుక్కల దుప్పిని.. ఇద్దరు కొట్టి చంపారు. వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్టు మైలవరం అటవీ అధికారి ఉషారాణి తెలిపారు.
చనిపోయిన దుప్పికి స్థానిక ఫారెస్ట్ ఆఫీసులో పంచనామా నిర్వహించి సంబంధిత వ్యక్తులపై అటవీ చట్టం-1972 ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. వారిని కోర్టు లో ప్రవేశపెడతామని చెప్పారు.
ఇదీ చదవండి: