కృష్ణా జిల్లా విజయవాడలో ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం రహదారిపై గందరగోళం సృష్టించింది. మేరిస్టెల్లా కాలేజీ సిగ్నల్ వద్ద ఆ కారు.. మితిమీరిన వేగంతో రెండు ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి..ట్రాక్టర్ ను ఓవర్ టేక్ చేయబోయి యువకుడు మృతి