ETV Bharat / state

'నా లేఖను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లండి... ఇదే చివరి కోరిక' - కృష్ణా జిల్లా తాజా వార్తలు

అప్పులు ఇచ్చిన వారి వేధింపులతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయేముందుకు ఓ లేఖ రాసి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడో రాశాడు. ఈ లేఖను సీఎం జగన్​కు చేరవేయాలని పేర్కొన్నాడు.

Cab driver commits suicide by writing letter to CM Jagan

author img

By

Published : Jul 27, 2020, 8:03 PM IST

పైనాన్షియర్ల వేధింపులు తట్టుకోలేక ఓ క్యాబ్‌ డ్రైవర్‌ ఆత్మహత్మకు పాల్పడ్డాడు. అప్పు చెల్లించినా వేధిస్తున్నారంటూ సూసైడ్‌ లెటర్‌ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

కృష్ణా జిల్లా పమిడిముక్కుల మండలం ముళ్లపూడికి చెందిన శివమల్లేశ్వరరావు ఓ క్యాబ్ డ్రైవర్​గా పని చేస్తున్నాడు. కుటుంబ పోషణ కోసం కొందరి దగ్గర అప్పులు చేశాడు. అయితే అప్పు మొత్తాన్ని తిరిగి చెల్లించినా తనను ఫైనాన్షియర్లు వేధిస్తున్నారంటూ అతను ఓ లేఖ రాసి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

శ్రీరామ్ ట్రాన్స్‌ఫోర్ట్ మేనేజర్ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని సూసైడ్ లెటర్​లో ఆవేదన వ్యక్తం చేశాడు. సందీప్, నాగరాజు, శివ చింతయ్యల దగ్గర తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించినా ఇంకా వేధిస్తున్నారని పేర్కొన్నాడు. ఇలాంటి నేరాలను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరాడు. ఈ లేఖను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులను వేడుకున్నాడు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో లక్ష దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.