ETV Bharat / state

హంద్రీనీవా సుజల స్రవంతితో అనంతపురం జిల్లా సస్యశ్యామలం: జగన్ - Anantapur Latest News

హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా రాయలసీమలో అదనంగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు ఇవ్వాలన్నది ప్రభుత్వం లక్ష్యమని... సీఎం జగన్ వివరించారు. దీనికోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో 3 రిజర్వాయర్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. సాగునీటి ప్రాజెక్టులు సత్వరమే పూర్తి చేయడం ద్వారా అనంతపురం జిల్లాలో ప్రజల జీవన స్థితిగతులను మార్చుతామని పేర్కొన్నారు.

Jagan
హంద్రీనీవా సుజల స్రవంతితో అనంతపురం జిల్లా సస్యశ్యామలం: జగన్
author img

By

Published : Dec 9, 2020, 2:48 PM IST

Updated : Dec 9, 2020, 4:11 PM IST

హంద్రీనీవా సుజల స్రవంతితో అనంతపురం జిల్లా సస్యశ్యామలం: జగన్

హంద్రీనీవా సుజలస్రవంతి పథకంలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన 3 రిజర్వాయర్లకు ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో తోపుదుర్తి, దేవరకొండ, ముట్టాల రిజర్వాయర్లకు శంకుస్థాపన చేశారు. చెన్నేకొత్తపల్లిలోని వెంకటాపురం పైలాన్ వద్ద జరిగిన కార్యక్రమంలో అనంతపురం జిల్లా ఇంఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

శంకుస్థాపన అనంతరం సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు 2018 జనవరి 24న జీవో మాత్రమే ఇచ్చి పనులు చేయలేదని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 3 రిజర్వాయర్ల పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కెపాసిటీని మరో 3.3 టీఎంసీలు పెంచి అదనంగా మరో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్టు వివరించారు. గత ప్రభుత్వం రూ.803 కోట్ల అంచనా వ్యయంగా నిర్ణయించిందని.. మూడేళ్లు దాటినా ప్రస్తుతం అదే అంచనా వ్యయంతో మూడు రిజర్వాయర్లను నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో లంచాలను కట్టడి చేస్తున్నామని చెప్పడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు.

90 రోజుల్లో 5 జలాశయాల్లో 7.21 టీఎంసీల నీరు నింపుతామని సీఎం జగన్ చెప్పారు. ప్రస్తుతం నిర్మిస్తోన్న 3 రిజర్వాయర్ల వల్ల 75 వేల ఎకరాలకు సాగునీరు, పలు ప్రాంతాలకు తాగునీరు అందుతుందని వివరించారు. బెలుగుప్ప, కూడేరు, ఆత్మకూరు, కంబదూరు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రాప్తాడు, రామగిరి మండలాల్లో 75 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ప్రస్తుతం 3 రిజర్వాయర్ల నిర్మాణం కోసం 5171 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందన్న జగన్... జీడిపల్లి జలాశయం నుంచి ఎగువపెన్నా జలాశయం వరకు 53.45 కి.మీ ప్రధాన కాలువ, 4 ఎత్తిపోతల పథకాలు, 110 కాంక్రీట్ కట్టడాలు చేస్తామన్నారు.

కొత్తపల్లి, ఆత్మకూరు, బాలవెంకటాపురం, మద్దెలచెరువు వద్ద 4 ఎత్తిపోతల పథకాలు రాబోతున్నాయని జగన్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న 1.81 టీఎంసీల ఎగువపెన్నా జలాశయానికి అదనంగా ముట్టాల జలాశయాన్ని 2.024 టీఎంసీలు, తోపుదుర్తి 0.992 టీఎంసీలు, దేవరకొండ-0.89 టీఎంసీ, సోమరవాండ్లపల్లి జలాశయాన్ని 1.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు. హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా రాయలసీమలో అదనంగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు ఇవ్వాలనేది ప్రభుత్వం లక్ష్యమని వివరించారు.

ప్రాజెక్టుకు వైఎస్సార్ పేరు పెట్టాలని స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్​రెడ్డి కోరగా.. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. డాక్టర్ వైఎస్సార్ అప్పర్​పెన్నా ప్రాజెక్టుగా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్​లోనే దీనికి సంబంధించి జీవోను విడుదల చేశారు. రిజర్వాయర్ల నిర్మాణంతో ప్రజలు ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారతాయని ముఖ్యమంత్రి జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి. సర్వే ఆఫ్ ఇండియాతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం

Last Updated : Dec 9, 2020, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.