కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పెదకళ్లేపల్లి గ్రామానికి చెందిన దోనే బాబురావు ఇంట్లో... విద్యుదాఘాతంతో మంటలు అంటుకున్నాయి. సుమారు రూ.80 వేల ఆస్తినష్టం జరిగినట్లు ఫైర్ అధికారి ప్రాథమికంగా పేర్కొన్నారు. ఉన్న ఒక్కగానొక్క ఆధారం మంటల్లో బూడిదైందంటూ.. బాధితులు ఆవేదన చెందారు.
మోపిదేవి మండలం నాగాయతిప్ప గ్రామంలో జరిగిన విద్యుదాఘాతంతో బొల్లిముంత శ్రీనివాసరావుకు చెందిన 3 ఎకరాల గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.15 వేలు నష్టం జరిగిందని అవనిగడ్డ అగ్నిమాపక సిబ్బంది బాలమురళి కృష్ణ ప్రాథమికంగా అంచనా వేశారు.
ఇదీ చూడండి: