విజయవాడలోని విధ్యధరపురం శంకర మఠంలో అర్చకులు ఆందోళన చేపట్టారు. కర్నూలు జిల్లాలో అర్చకుడిపై దాడిని నిరసిస్తూ మఠం ప్రాంగణంలో సామూహికంగా కొబ్బరికాయలు కొట్టారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల్లోని అర్చకులపై... నూతన దేవాలయ కమిటీల పెత్తనం పెరిగిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో దేవస్థాన కమిటీ ఛైర్మన్ దాడి చేయడం వైకాపా నాయకుల దుశ్చర్యలకు పరాకాష్ఠ అని అర్చక బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు.
ఇదీ చదవండి