కృష్ణా జిల్లా ఘంటసాల మండలం వేములపల్లిలో పాముకాటుతో బాలుడు మృతి చెందాడు. ఈ రోజు తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో జతిన్(10)ను పాము కాటేసింది. తల్లిదండ్రులు చల్లపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా... ప్రాథమిక వైద్యం చేసి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో బాలుడు చనిపోయాడు. బాలుడిని తరలిస్తున్న అంబులెన్స్ ఉయ్యూరు వద్ద మొరాయించడంతో దాదాపు రెండు గంటలు అక్కడే వేచిఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి.. 'మీలా... నిధులు మళ్లించలేదు.. జైలుకెళ్లలేదు'