పుస్తకం చేతిలో ఆభరణం లాంటిదని... ఇష్టమైనవారికి పుస్తకాలను బహుమతిగా ఇవ్వడం మంచి అలవాటని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో 31వ పుస్తక మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. మంత్రులు ఆదిమూలపు సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, తెలుగు భాష సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, సినీ దర్శకుడు వంశీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తాను పుస్తక ప్రేమికుడినని... ఒడియా భాషలో దేశభక్తి సాహిత్య రచయితనని గవర్నర్ చెప్పుకొచ్చారు. పిల్లలకు పుస్తక పఠనం అలవాటయ్యేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు వీలైనంత ఎక్కువ సమయం పుస్తక పఠనంలో గడపాలని మంత్రి ఆదిమూలపు సురేష్ పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి: