ETV Bharat / state

భారీ ర్యాలీతో బోడెప్రసాద్ నామినేషన్ - krishna

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యాక కృష్ణాజిల్లాలో తొలి నోటిఫికేషన్‌ను పెనమలూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి బోడెప్రసాద్‌ దాఖలు చేశారు.

బోడె ప్రసాద్
author img

By

Published : Mar 18, 2019, 7:25 PM IST

భారీ ర్యాలీతో వెళ్తున తెదేపా అభ్యర్థి
కృష్ణాజిల్లా పెనమలూరు అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా బోడె ప్రసాద్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. పోరంకిలోని ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ కార్యాలయం నుంచి పెనమలూరు వరకూ భారీ ర్యాలీ చేశారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సహా స్థానిక నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. పెనమలూరులోని తహశీల్దారు కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్‌ పత్రాలను అందించారు. బోడె ప్రసాద్‌ తరఫున రెండు సెట్లు.. ఆయన సతీమణి హేమ పేరిట మరో రెండు సెట్లు నామినేషన్‌ దాఖలు చేశారు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావు, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌, పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరిగ్గా 11గంటల 15నిమిషాలకు నామినేషన్‌ పత్రాలను అందించినట్లు అధికారులు తెలిపారు. . ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యాక కృష్ణాజిల్లాలో దాఖలైన తొలి నోటిఫికేషన్‌ తనదేనని బోడె ప్రసాద్‌ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పెనమలూరులో తేదేపాకు ఘన విజయం వస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు.

Panaji (Goa), Mar 18 (ANI): Prime Minister Narendra Modi and Union Defence Minister Nirmala Sitharaman on Monday reached Panaji's Kala Academy to pay their last respects to Goa Chief Minister Manohar Parrikar. Parrikar who was suffering from pancreatic ailment for a year breathed his last on Sunday evening at his residence.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.