కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోన్న వివిధ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చుకోని ప్రచారం చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నామని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్.విష్ణువర్దనరెడ్డి అన్నారు. ఈ పద్ధతిని మార్చుకోకపోతే ప్రజా ఆందోళన తప్పదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రులు... కేంద్ర పథకాలకు తమ స్టిక్కర్లు అతికించుకుని.. 'స్టిక్కర్ సీఎంలు'గా మారిపోతున్నారన్నారు.
నవరత్నాల పేరిట కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి ప్రజలకు ఇవ్వాలనుకోవడం సరికాదన్నారు. మాటతప్పం మడమతిప్పం అంటే ఇదేనా..? అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రధాని ఫొటో... కేంద్ర ప్రభుత్వ లోగో తప్పని సరిగా ముద్రింపజేయాలని కోరారు.
ఇదీ చదవండి: