ETV Bharat / state

కొవిడ్​ బాధితులకు అండగా.. దాతల సేవా కార్యక్రమాలు - కొవిడ్​ బాధితుల కోసం పలు సేవా కార్యక్రమాల వార్తలు

కరోనా కష్టకాలంలో స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు.. ప్రముఖులు.. బాధితులకు అండగా నిలుస్తున్నారు. మాస్కులు, భోజనం పంపిణీ, కొవిడ్​ ఆస్పత్రులకు వసతుల కల్పన వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణా జిల్లా గన్నవరంలో భాజపా సీనియర్ నేత చిగురుపాటి కుమారస్వామి కరోనా బాధితుల కోసం తన సొంత ఖర్చులతో ఐసోలేషన్​ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

covid services
సేవా కార్యక్రమాలు
author img

By

Published : Jun 15, 2021, 9:16 AM IST

భాజపా సీనియర్ నేత చిగురుపాటి కుమారస్వామి కొవిడ్ బాధితులకు బాసటగా నిలిచారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో సొంత ఖర్చులతో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నాణ్యమైన భోజనం, వైద్య సేవలు అందిస్తున్నారు. బాధితులు ఉల్లాసంగా గడిపేందుకు యోగా, క్రీడలకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. పాటు మానసిక నిపుణుల చేత ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహిస్తూ రోగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేందుకు కృషి చేస్తున్నారు. గోపాలరావు స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కొవిడ్ కేంద్రాన్ని భాజపా రాష్ట్ర ఇంఛార్జి సునీల్ దియోధర్, అధ్యక్షుడు సోము వీర్రాజు, పలువురు ఎన్నారైలు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, సందర్శించి.. కుమారస్వామి సేవలను కొనియాడారు.

కర్నూలు జిల్లాలో...

ఎమ్మిగనూరులో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా రోగులకు మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలో హోం ఐసోలేషన్​, క్వారంటైన్​ సెంటర్లలో ఉన్న వంద మంది రోగులకు రూ.700 విలువ చేసే మందులను అందించారు.

విజయనగరం జిల్లాలో...

సాలూరు పట్టణంలో కొవిడ్​ సమయంలో సేవలందించిన వారిని సత్కరించి, పోలీసు శాఖ తరఫున సర్టిఫికెట్లు అందించారు. ఎస్పీ బి. రాజకుమారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సర్టిఫికెట్లు పొందిన వారు ప్రాణదాత ట్రస్టు ద్వారా వలస కార్మికులకు, కరోనా బాధితులకు అన్నదానం, దాతల ద్వారా ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ వసతి కల్పించటం, రోగులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందించటం, కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు జరిపించి మానవత్వం చాటుకున్నారు.

సాలూరు సీహెచ్​సీ, ఫిలడెల్ఫియా ఆసుపత్రిలో రోగులకు వసతి, పేదలకు నిత్యావసరాలు, బట్టల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించి జిల్లాలోనే ఉత్తమ సేవలందించారని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీ వడాడ గణేశ్వరరావు, గంటా వెంకటరాజు, ఇందుపూరి నారాయణ రావు, మోయిద కృష్ణ మాస్టర్, వడ్డాది షణ్ముఖ ముత్యాలు, ఎమ్మెల్టీ రాజేశ్, కాసా నాగేంద్ర, టేకి ధనుంజయ మజ్జి ఈశ్వరమ్మ, చిక్కాల చిన్నమ్మలు సర్టిఫికెట్లు అందుకున్నారు.

విశాఖ జిల్లాలో...

నర్సీపట్నంలో స్టార్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో దాతలు... పట్టణ పోలీసులకు ఉచితంగా రెండు గ్యాస్​ కాన్సంట్రేటర్లు అందించారు. స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్​, నర్సీపట్నం ఏఎస్పీ హుస్సేన్ సింహ చేతుల మీదుగా పోలీసులకు ఇచ్చారు. కరోనా సమయంలో ఈ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగానే పోలీసులకు కాన్సంట్రేటర్లు పంపిణీ చేశారు. ఫ్రంట్​లైన్​ వర్కర్లుగా పనిచేస్తున్న పోలీసులకు వీటిని అందించటం సంతోషకరమని ఎమ్మెల్యే ఉమాశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ స్వామినాయుడు, స్టార్​ ఫౌండేషన్​ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లాలో...

అవనిగడ్డ మండలం బందలాయిచెరువు ఎస్సీ కాలనీలో ఉచితంగా ఆయుర్వేద మందులు, మల్టీ విటమిన్ టాబ్లెట్లు పంపిణీ చేశారు. అవనిగడ్డ ప్రెస్ క్లబ్, విజయవాడకు చెందిన జయప్రద ఫౌండేషన్, మర్రిపాలెం ఆయుర్వేద వైద్యశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సీఐ భీమేశ్వర రవికుమార్​, డాక్టర్​ ఉషారాణి చేతుల మీదుగా మందులు అందించారు.

నలభై ఐదేళ్లు పైబడిన వారు, ఐదేళ్ల లోపు పిల్లల తల్లులు కరోనా వ్యాక్సిన్​ వేయించుకోవాలని సీఐ రవికుమార్​ అన్నారు. మాస్కు ధరించటం, భౌతిక దూరం పాటించటం ద్వారానే కరోనా కట్టడి చేయవచ్చని చెప్పారు. జాగ్రత్తలు పాటించటం వల్ల మొదటి దశలో కొవిడ్​ కేసులు, మరణాలు తక్కువుగా ఉండేవన్నారు. నిర్లక్ష్యం వల్లే రెండో దశలో కరోనా తీవ్రత ఎక్కువైందన్నారు. ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమం చేపట్టినందుకు నిర్వాహకులను సీఐ అభినందించారు.

ఇదీ చదవండి:

Death Rate in AP: 'సగటు'ను మించిన మరణాలు.. గత నెలలో ఏకంగా రెండు రెట్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.