విజయవాడ నగర శివారు పాయికాపురం ఉడా కాలనీలోని వార్డు నెంబర్ 278 సచివాలయంలో వాలంటీర్లు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకున్నారు. రాత్రి సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించడమే కాక.. లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా, కరోనా వైరస్ కనీస జాగ్రత్తలు తీసుకోకుండా పార్టీ చేసుకున్నారు.
వారి తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సచివాలయ సిబ్బంది ఐదుగురు యువకులు, ఇద్దరు మహిళా ఉద్యోగులు, సచివాలయ సెక్రటరీ ఈ పార్టీలో పాల్గొన్నారు. ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించాల్సిన వీర.. ఇలా ప్రవర్తించడంపై స్థానికులు మండిపడుతున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇదీ చదవండి: