కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై మాజీ మంత్రి భుమా అఖిల ప్రియ ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రజలు కోరేది నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలని... హైకోర్టు వచ్చినంత మాత్రాన నీళ్లు, పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయా అని ఆమె ప్రశ్నించారు. హైకోర్టు ఒక్కటే కర్నూలుకు ఇచ్చి సీఎం చేతులు దులుపుకోవడం సరికాదని, హైకోర్టు 2 బెంచ్‌లు వేరేచోట పెట్టి అందులోనూ మోసం చేశారని ఆమె ధ్వజమెత్తారు.
హంద్రీ-నీవా సుజల స్రవంతి, గాలేరు-నగరి పనులను శరవేగంగా పూర్తి చేయాలని అఖిలప్రియ డిమాండ్ చేశారు. తెదేపా ప్రభుత్వం 23 ప్రాజెక్టుల నిర్మాణం 5ఏళ్లలోనే పూర్తి చేసిందని, వైకాపా 46ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆమె సూచించారు. తెదేపా హయాంలో కర్నూలు, అనంతపురం, కడపలో 44వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో సోలార్ విండ్ పవర్ ప్లాంట్లు తెచ్చామని ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వం అంతకు రెట్టింపు పెట్టుబడులను సీమకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యపెట్టే చర్యలు మానుకోవాలని అఖిలప్రియ హితవు పలికారు.
ఇదీ చూడండి