కరోనా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందుతూనే ఉన్నాయి. సీఎం సహాయనిధికి భారతి సిమెంట్స్ సంస్థ రూ.5 కోట్ల 14 లక్షల 50 వేల రూపాయల విరాళం అందించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ను కలిసిన భారతి సిమెంట్ ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ.. చెక్కు అందజేశారు. అలాగే వర్షిణీ చారిటబుల్ ట్రస్ట్ సైతం కోటీ పది లక్షల రూపాయల విరాళం ప్రకటించింది. వర్షిణి ట్రస్టు ప్రతినిది మెహర్ శ్రీనివాస్ ముఖ్యమంత్రికి చెక్కు అందించారు.
ఇదీ చూడండి: