'నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు' పథకం లబ్ధిదారులందరు పక్కా గృహాలు నిర్మించుకునేలా చూడాలని అధికారులను పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆదేశించారు. కృష్ణా జిల్లా గుడివాడలోని మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకంపై సమీక్ష నిర్వహించారు. గుడివాడ డివిజన్ వ్యాప్తంగా పక్కా గృహాల నిర్మాణ వివరాలను జేసీ మాధవి లత, ఇతర అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు.
ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా లబ్ధిదారులు తమ ఇళ్లను నిర్మించుకునేలా అధికార యంత్రాంగం సహకారాన్ని అందించాలని జేసీ సూచించారు. డివిజన్ స్థాయి హౌసింగ్ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు దూలం నాగేశ్వరావు, కైలె అనిల్ కుమార్, హౌసింగ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: