రాష్ట్రంలోని కోస్తా తీరంతోపాటుగా రాయలసీమ ప్రాంతాన్ని, అలాగే దక్షిణ భారతదేశం అవతలి ప్రాంతాలను అనుసంధానించడంలో గుంటూరు, గుంతకల్లు సెక్షన్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం సింగిల్ లైనుపై రైళ్ళ రాకపోకలు సాగుతున్నందున.. ఈ లైనులో రైళ్ళ రాకపోకలు పరిమితంగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు పూర్తి కావటంతో నల్లపాడు - పేరిచర్ల మధ్య రైల్వే లైన్‌పై రాకపోకలను రైల్వే అధికారులు ప్రారంభించారు. గుంటూరు, గుంతకల్లు మధ్య మరింత ఎక్కువ సంఖ్యలో ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్ళను నడిపే సామర్థ్యం పెంచేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
హైదరాబాద్, నడికుడి వైపు నుంచి రాయలసీమ ప్రాంతానికి, దక్షిణ భారతంలోని దిగువ ప్రాంతాలకు మరిన్ని రైలు సర్వీసును నడిపేందుకు వీలు కలుగుతుంది. ఈ అనుసంధానం ద్వారా ఖనిజాలు పుష్కలంగా లభ్యమయ్యే పల్నాడు ప్రాంతం... దేశంలోని మరే ఇతర ప్రాంతానికైనా ఉత్పత్తులను రవాణా చేసేందుకు అవకాశం లభిస్తుంది. గుంటూరు, విజయవాడ ప్రాంతంలో రైళ్ళ రాకపోకల సామర్థ్యం పెరగటంతో పాటుగా, రైళ్ల ట్రాక్ లైన్ రద్దీని తగ్గించవచ్చు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంలో కృషి చేసిన అధికారులు, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజరు గజానన్ మాల్యా అభినందించారు.
ఇవీ చూడండి: