ETV Bharat / state

పాలనా కేంద్రం విశాఖే... బీసీజీ నివేదిక స్పష్టం - అమరావతిపై బీసీజీ నివేదిక

ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే బోస్టన్ కన్సల్టెంగ్‌ గ్రూప్ నివేదిక ఇచ్చింది. ముఖ్యమంత్రి జగన్ సహా...మంత్రులు పదేపదే ఇస్తున్న సంకేతాలకు తగ్గటే అమరావతి అసాధ్యమని తేల్చి చెప్పింది. రాష్ట్ర రాజధాని ఒకేచోట కాకుండా... విస్తరిస్తే బాగుంటుందంటూ రెండు ఆప్షన్లు ప్రతిపాదించినా...అవి రెండూ విశాఖ వైపే మొగ్గు చూపడం విశేషం.

Bcg submitted report ot ap govt
బీసీజీ నివేదిక
author img

By

Published : Jan 4, 2020, 5:59 AM IST

Updated : Jan 4, 2020, 6:17 AM IST

పాలనా కేంద్రం విశాఖే... బీసీజీ నివేదిక స్పష్టం

రాష్ట్రంలో సమీకృత, సమతుల్య అభివృద్ధి వ్యూహాలపై రాష్ట్రప్రభుత్వం నియమించిన కన్సల్టెన్సీ సంస్థ బీసీజీ అమరావతిలో రాజధాని ఏర్పాటు సరికాదని నివేదిక ఇచ్చింది. ప్రాంతాల వారీగా ప్రజల ఆకాంక్షలు, మౌలిక సదుపాయాలు, ఆర్థిక అంశాలను బేరీజు వేసిన బోస్టన్ కన్సెల్టెన్సీ గ్రూప్ నివేదిక రూపొందించింది. అమరావతి స్థానంలో విశాఖను అభివృద్ధి చేయాలని సూచించింది. విజయవాడ, విశాఖల్లో సచివాలయం, శాసనసభ, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు రెండు ప్రతిపాదనల్ని సిద్ధం చేశామన్న బీసీజీ.. ఆర్థిక వనరుల్ని మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని వెల్లడించింది. సచివాలయం విశాఖలో, శాసనసభ అమరావతిలో , హైకోర్టును కర్నూలులో ఏర్పాటుచేయాలని స్పష్టం చేసింది.

13 జిల్లాలను.. 6 ప్రాంతాలుగా విభజన

అన్ని జిల్లాల్లో సమతుల్య అభివృద్ధికి అనుగుణంగా... 13 జిల్లాలను 6 ప్రాంతాలుగా విభజించి నివేదిక ఇచ్చారని ప్రణాళిక సంస్థ కార్యదర్శి విజయ్ కుమార్ స్పష్టం చేశారు. జీఎస్డీపీ, ఎకానమీ, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు ఇలా అన్ని అంశాలను బీసీజీ పరిగణలోకి తీసుకుందని తెలిపారు. చాలా అంశాల్లో రాష్ట్రం వెనుకంజలో ఉందని .. వ్యవసాయం మినహా ఏవి సంతృప్తికరంగా లేవని నివేదిక పేర్కొందని ఆయన తెలిపారు.

మూడు రాజధానులు మంచిదే..!

పాలన వికేంద్రీకరణను అనుసరిస్తే మంచిదని బీసీజీ నివేదికలో పేర్కొంది. ఈ విషయంలో చారిత్రక నేపథ్యాన్ని బీసీజీ పరిగణనలోకి తీసుకుంది. మూడు రాజధానులు ఇతర ప్రాంతాల్లో విజయం సాధించిన పరిస్థితులు పరిశీలించింది. కర్ణాటక, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతంల్లోనూ హైకోర్టు, సచివాలయాలు వేర్వేరుగా ఉన్నాయని తెలిపింది. నగరాలు ఎక్కువ జనాభాతో నిండి పోకూడదని బీసీజీ సూచించింది. వివిధ విభాగాల మధ్య సమన్వయం, ఖర్చు తగించటం, సులువుగా రవాణా, ప్రాంతీయ ఆకాంక్షలు పరిగణనలోకి తీసుకుని నివేదిక ఇచ్చామని కమిటీ తెలిపింది. మూడు ప్రాంతాల్లోని జనాభా, మౌలిక సదుపాయాల గమనించి విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు కడప, తిరుపతి నుంచి పరిగణనలోకి తీసుకున్నారని విజయ్ కుమార్ అన్నారు.

విశాఖ నగరమే పాలనకు అనువు

ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి 6 భాగాలుగా వర్గీకరణ చేసి ప్రస్తుత పాలన అంశాల్లో ఏవి ఎక్కడ ఉండాలో స్పష్టం చేశారు. లోతుగా అధ్యయనం చేసి ఈ అంశాలు నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వం కార్యకలాపాలకు, అంశాల వారీగా విజయవాడకు మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత విశాఖకు ఇచ్చారు. రాజధాని ఏర్పాటుకు సంబంధించి విశాఖలో సచివాలయం, గవర్నర్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, అమరావతిలో శాసనసభ ఇతర కార్యాలయాలు, కర్నూలులో హైకోర్టు, స్టేట్ కమిషన్లు , అప్పిలేట్​లు, ఇలా రెండు ప్రతిపాదనల్ని బీసీజీ సమర్పిచింది.

శాటిలైట్ కమిషనరేట్లు

మరోవైపు సచివాలయానికి ప్రజలు ఎందుకు వస్తున్నారనే అంశాన్ని కూడా పరిశీలన చేశారు. వివిధ రకాల ప్రభుత్వ పనులను శాటిలైట్ కమిషనరేట్​ల ద్వారా అందిస్తే.. ప్రజలకు సచివాలయానికి వచ్చే అవసరం ఉండదని నిర్ధారించారు. ఇందులోనూ బీసీజీ రెండు ఆప్షన్​లు ఇచ్చింది. ఈ నివేదికను హైపవర్ కమిటీకి పంపుతామని ప్రభుత్వానికి తెలిపింది.

ఇదీ చదవండి :

బోస్టన్ కమిటీ నివేదికలోని అంశాలేంటంటే?

Last Updated : Jan 4, 2020, 6:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.