ETV Bharat / city

బోస్టన్ కమిటీ నివేదికలోని అంశాలేంటంటే? - undefined

రాష్ట్రంలో కొన్ని జిల్లాలు వనరులు ఉన్నప్పటికీ... అభివృద్ధికి నోచుకోలేదని బోస్టన్​ కన్సల్టెన్సీ నివేదికలో తేల్చారు. పర్యాటక, పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనకబడినట్లు బీసీజీ నివేదిక తేల్చిందని.. ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు.

బోస్టన్ కమిటీ
బోస్టన్ కమిటీ
author img

By

Published : Jan 3, 2020, 7:59 PM IST

Updated : Jan 3, 2020, 8:47 PM IST

13 జిల్లాలు ఆరు ప్రాంతాలుగా అధ్యయనం

బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్స్​ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ కార్యదర్శి విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. నివేదికకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 13 జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని ఆరు భాగాలుగా విభజించి కమిటీ అధ్యయనం చేసిందని అన్నారు. ఏ ప్రాంతంలో ఏయే వనరులు ఉన్నాయో కమిటీ అధ్యయనం చేసిందని వెల్లడించారు. విశాఖలో తప్ప మిగతా చోట్ల అంతర్జాతీయ విమాన ప్రయాణికులు అంతగా లేరని..పోర్టులు కూడా విశాఖలో మినహా మిగతా చోట్ల అభివృద్ధి చెందలేదని తెలిపారు. రాష్ట్రానికి రూ. 2.5 లక్షల కోట్ల రుణభారం ఉందని...ఎనిమిది జిల్లాల్లో పారిశ్రామిక ఉత్పత్తి చాలా తక్కువగా ఉందన్నారు. విదేశీ పర్యటకుల వల్ల ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రను మెడికల్ హబ్​గా చేయవచ్చని...కాఫీ, పసుపు, జీడిపప్పు పరిశ్రమలకు ఉత్తరాంధ్ర ఎంతో అనుకూలంగా ఉందని వివరించారు. కృష్ణా డెల్టాను ఎడ్యుకేషన్ హబ్​గా మార్చవచ్చని చెప్పారు.

  • ఉత్తరాంధ్రను మెడికల్‌ హబ్‌గా అభివృద్ధి చేయవచ్చు
  • కాఫీ, పసుపు, జీడిపప్పు పరిశ్రమలకు ఉత్తరాంధ్ర అనుకూలం
  • కొన్ని రకాల పర్యాటకాలకూ ఉత్తరాంధ్ర చాలా అనుకూలంగా కూడా ఉంది
  • గోదావరి డెల్టాలో ప్లాస్టిక్‌, గ్యాస్‌ రంగాల్లో పరిశ్రమలు పెట్టవచ్చు.
  • గోదావరి డెల్టాలో బ్యాక్‌వాటర్‌ టూరిజం లాంటివి అభివృద్ధి చేయవచ్చు.
  • పోలవరం, వాటర్‌ గ్రిడ్, రోడ్ గ్రిడ్ లాంటివి గోదావరి డెల్టాలో ఏర్పాటు చేయవచ్చు
  • కృష్ణా డెల్టాలో ఎడ్యుకేషన్‌ హబ్‌ అభివృద్ధి చేయవచ్చు.
  • మైపాడు సముద్రతీరాన్ని బాగా అభివృద్ధి చేయవచ్చు.
  • గోదావరి-పెన్నా అనుసంధానం చేసేందుకు కమిటీ ప్రతిపాదనలు చేసింది.
  • కర్నూలు-అనంతపురం ప్రాంతంలో ఆటోమొబైల్‌ లాజిస్టిక్‌ హబ్‌కు అవకాశం
  • తిరుపతిలో ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ప్రోత్సహించాలని కమిటీ సూచించింది
  • చిత్తూరు జిల్లాలో టమాటాల నిల్వకు శీతల గిడ్డంగులు అభివృద్ధి చేయాలి.
    ఆరు ప్రాంతాల్లో అభివృద్ధిపై సూచనలు

10 వేల కోట్ల వడ్డీ కట్టాలి..
ఏ విధంగా చూసినా కొత్త రాజధానులు విజయం సాధించలేదని కమిటీ తేల్చి చెప్పింది. మలేషియా రాజధాని పుత్రజయ 20 ఏళ్లయినా లక్ష్యాలు సాధించలేదని ఉదహరించింది. 2025 నాటికి అమరావతి నిర్మాణానికి రూ.లక్ష కోట్ల ఖర్చు దాటుతుందని అంచనా వేసింది. అమరావతి దార్శనిక పత్రంలో జనాభా విషయంలో పేర్కొన్న పెరుగుదలను అందుకోలేదని వివరించారు. అమరావతి దార్శనిక పత్రంలో పేర్కొన్న లక్ష్యాలు చేరుకోవాలంటే రూ.1.10 లక్షల కోట్లు అవసరమని పేర్కొంది. అమరావతి నిర్మాణానికి రుణం తెస్తే ఏటా రూ.10 వేల కోట్లు వడ్డీ కట్టాలని బీసీజీ నివేదికలో వెల్లడించింది.

కమిటీ పరిగణనలోనికి తీసుకున్న పలు అంశాలు

కమిటీ ఇచ్చిన నివేదికలోని పలు అంశాలు..

  • విద్యాశాఖ, స్థానికసంస్థల శాఖలు విజయవాడ కేంద్రంగా పని చేయాలని కమిటీ సూచన
  • ఆప్షన్‌-1 కింద విశాఖలో గవర్నర్‌ కార్యాలయం, సీఎం కార్యాలయం, సచివాలయం
  • విశాఖలో హైకోర్టు బెంచ్‌, అత్యవసర శాసనసభ
  • అమరావతి కేంద్రంగా హైకోర్టు బెంచ్‌, అసెంబ్లీ
  • అమరావతిలో మట్టి నాణ్యమైనది కాదని వెల్లడి.
  • అమరావతిలో నిర్మాణ వ్యయం రెట్టింపు అవుతుందని పేర్కొన్న కమిటీ
  • కర్నూలులో పలు కమిషనర్ కార్యాలయాలు పెట్టాలని సిఫారసు
  • విశాఖలో సచివాలయం, గవర్నర్, సీఎం కార్యాలయాలు, ప్రభుత్వ శాఖలు
  • కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది
  • ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని విశాఖలో, కొన్ని అమరావతిలో, మరికొన్ని కర్నూలులో ఏర్పాటుకు సిఫారసు
  • ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన స్థలం అమరావతిలో ఎక్కువ ఉంది.

Intro:Body:Conclusion:
Last Updated : Jan 3, 2020, 8:47 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.