ETV Bharat / state

బాబు భాష మార్చుకో - ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

ముఖ్యమంత్రి జగన్ పై మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ చీఫ్ విప్ జి. శ్రీకాంత్ రెడ్డి తప్పు పట్టారు. నవరత్నాలు చక్కగా అమలు చేస్తున్నారనే అక్కసుతో సహనాన్ని కోల్పోయి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. భాష మార్చుకోవాలని సూచించారు.

బాబు భాష మార్చుకో - ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
author img

By

Published : Oct 22, 2019, 5:31 PM IST

Updated : Oct 22, 2019, 11:26 PM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విమర్శలపై వైకాపా మండిపడింది. చంద్రబాబు హూందాతనం , సంస్కారం లేకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ జి. శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. భాష మార్చుకోకపోతే ప్రజలే బుద్ది చెబుతారని హితవు పలికారు. నవరత్నాలు బాగా అమలు చేస్తున్నారనే అక్కసుతో.. చంద్రబాబు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. డీజీపీని ఖబడ్దార్ అని చంద్రబాబు అనడం దారుణమని, పోలీసులు మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారన్నారు. చంద్రబాబు హయాంలో మద్యంతో వేలకోట్లు దోచుకున్న నేతలు ఇప్పుడు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. భాజపాతో స్నేహం కోసం ఆ పార్టీనేతల కాళ్లుపట్టుకుంటూ రాజకీయ వ్యభిచారానికి దిగజారుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఔట్ డేటెడ్, కొడుకు లోకేశ్‌ అన్ వ్యాలిడ్ రాజకీయ నేతలుగా మారారన్నారు. నెలలో రివర్స్ టెండరింగ్ ద్వారా వెయ్యికోట్లు సీఎం జగన్ మిగిల్చితే దేవినేని ఉమా దోపిడీ జరిగిందని విమర్శలు చేయడం దారుణమన్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసమే సీఎం దిల్లీ పర్యటన చేస్తున్నారని వ్యక్తిగత ఏజెండా ఏమీ లేదని వివరించారు.

ఇదీ చదవండి : 'రాష్ట్రంలో పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్నాయి'

Intro:ap_knl_21_22_rastaroko_nyayavadulu_ab_AP10058
యాంకర్, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కర్నూలు జిల్లా నంద్యాలలో న్యాయవాదుల సంఘము రాస్తారోకో నిర్వహించారు. నంద్యాల సమీపంలోని వెంకటేశ్వరపురం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రాయలసీమ హైకోర్టు ఏర్పాటు హక్కు అని.. బిక్ష కాదని వారు తెలిపారు. హైకోర్టు ఏర్పాటు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని నంద్యాల బార్ అసోసియేషన్ సంఘము అధ్యక్షుడు నాగరాజు అన్నారు

Body:జాతీయ రహదారిపై న్యాయవాదుల సంఘము రాస్తారోకో

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
Last Updated : Oct 22, 2019, 11:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.