కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ఆటోనగర్ దినకర్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారంలో.. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వరంలో కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మోహన్ కుమార్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పాల్గొన్నారు.
సీఎం జగన్ సూచనల మేరకు 10రోజుల పాటు కొవిడ్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ వైరస్ సోకితే ఏం చేయాలన్న దానిపై అవగాహన కల్పించారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకుంటే మహమ్మారికి దూరంగా ఉండొచ్చన్నారు. వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైద్యాధికారులు, సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు.
ఇవీ చదవండి..