ఎస్పీ ఆదేశాల మేరకు అవనిగడ్డ సీఐ రవికుమార్ కరోనాపై అవగాహన సమావేశం నిర్వహించారు. సబ్ డివిజన్ పరిధిలో 24/7 పోలీసులు అందుబాటులో ఉండేలా ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామని తెలిపారు. అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. అవసరమైతే తప్ప ప్రజలను బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి ఎవరైనా వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇవీ చదవండి...కడప జిల్లా రైల్వే కోడూరులో కరోనా అనుమానితుడు