ETV Bharat / state

ఆటోలకు అనుమతులు ఇవ్వండి - విజయవాడలో ఆటోల తాజా వార్తలు

బస్సు, రైలు, విమానాలకు, టాక్సీలకు అనుమతులు ఇచ్చినట్లే ఆటోలు తిరిగేందుకు తక్షణమే అనుమతులు ఇవ్వాలని ఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో ధర్నా​ నిర్వహించారు. రెండు నెలలుగా లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నట్టు చెప్పారు.

auto union iftu protest
ఆటోలకుఅనుమతులు ఇవ్వాలని ధర్నా
author img

By

Published : May 27, 2020, 2:17 PM IST

రెండు నెలలుగా లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయి ఆటో కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆటో కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ప్రజా రవాణాలో భాగమైన ఆటోలను నడిపేందుకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో ధర్నా​ చేశారు.

లాక్​డౌన్ ఉన్న రెండు నెలలకు ప్రతి ఆటో కార్మికుని కుటుంబానికి 10 వేలు రూపాయలు ఆర్ధిక సాయం చేయాలన్నారు. వాహనమిత్రలో సగం మంది కార్మికులకు లబ్ది చేకూరుతుందని... మిగిలిన వారు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచాలని కోరారు. వాహనాలపై కేసులు ఎత్తివేసి, రుణాలకు 6 నెలల మారిటోరియం విధించాలన్నారు.

ఇవీ చూడండి:

కరోనా దెబ్బతో క్షౌరశాలల్లో మారిన ప్రమాణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.