రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టారు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు రాష్ట్రంలోని అన్ని ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రిలలో కొవిడ్ వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. రెండో డోస్ టీకా వేసుకున్న 28 రోజుల తర్వాత శరీరంలో యాంటీబాడీస్ తయారవుతాయని తెలిపారు.
టీకా తీసుకున్నవారు అప్పటి వరకు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న పరిస్థితుల్లో.. వారికి చికిత్స అందించేందుకు నెట్ వర్క్ ఆస్పత్రిలో బెడ్లు సిద్దం చేస్తామని కేసులు సంఖ్య అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతున్నారు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో డాక్టర్ మల్లిఖార్జున్.
ఇవీ చదవండి: రేపే... ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్