ETV Bharat / state

ఏటీఎంకి వెళ్తున్నారా? ఇలాంటి వాళ్లతో జాగ్రత్త! - కృష్ణా జిల్లా వార్తలు

డబ్బులు త్వరగా తీసుకోవాలని..ఏటీఎం వెళ్తున్నారా? జాగ్రత్త మరీ. ఓ వ్యక్తిలాంటి వాళ్లు మీకు ఎదురయ్యారో అంతే సంగతులు. డబ్బులన్నీ మాయం. ఆ వ్యక్తి కాపు కాస్తే.. ఎవ్వరైనా... డబ్బు వదులుకోవాల్సిందే.

atm thive accused arrested by gannavaram police
author img

By

Published : Oct 14, 2019, 6:30 PM IST

ఏటీఎంకి వెళ్తున్నారా? ఇలాంటి వాళ్లతో జాగ్రత్త!

ఆ వ్యక్తికి కనిపిస్తే.. ఎదుటి వారి ఏటీఎంలో డబ్బులు మాయం. మహిళలు, వృద్ధులే అతడి టార్గెట్. పక్కా ప్రణాళికతో వస్తాడు. పర్సులోకి డబ్బు వెళ్లకముందే ఖాళీ చేసేస్తాడు. ఇంతకీ ఆ ఘరానా మోసగాడు డబ్బులు స్వాహా చేసేది ఎక్కడో తెలుసా? కృష్ణా జిల్లాలోనే. అమాయకంగా కనిపిస్తే చాలు అవలీలగా బురిడీ కొట్టిస్తాడు.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన చింతల సురేష్ బాబు కొంతకాలంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏటీఎం సెంటర్ ముందు మోసాలకు పాల్పడుతున్నాడు. ఏటీఎంకి వచ్చే వాళ్లతో నెమ్మదిగా లోపలికెళ్తాడు. తానూ డబ్బులు డ్రా చేస్తున్నట్టు నటిస్తాడు. ఎవరైనా అమయాకులు డబ్బులు డ్రా చేయడానికి తడబడుతుంటే.. సాయం చేస్తానంటూ వెళ్తాడు. పిన్​ నెంబర్​ తెలుసుకుంటాడు. తన దగ్గర ఉన్న మరో కార్డును అమాయకులు ఇచ్చేస్తాడు. ఐదు నిమిషాల తర్వాత డబ్బు మెుత్తం డ్రా చేస్తాడు. నిందితుడు సురేశ్ మోసాలను గుర్తించిన పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. ఐదు లక్షల 46వేల రూపాయలతోపాటు 10 బ్యాంకులకు చెందిన ఏటీఎం కార్డులు, హోండా యాక్టివాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 16 కేసుల్లో సురేశ్ నిందితుడిగా ఉన్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:వంద రూపాయల కాగితం.. తీసింది ఇల్లాలి ప్రాణం!

Intro:Ap_vja_33_14_ATM_chori_afender_arriest_av_AP10052
Sai babu : 9849803586
N0te : ఈ ఫైల్ నెంబర్ పై ఐటమ్ పంపాను. ఈ విడియొ వాకొనగలరు..plzBody:Ap_vja_33_14_ATM_chori_afender_arriest_av_AP10052Conclusion:Ap_vja_33_14_ATM_chori_afender_arriest_av_AP10052
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.