ETV Bharat / state

రమ్మీ కోసం చోరీలు... ఏటీఎం వద్ద నేరాలు... - Cybercrimes on the rise in Vijayawada

మీరు డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళుతున్నారా ? అయితే జాగ్రత్త. మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి. లేదంటే మీకు తెలియకుండా మీ ఖాతాలో నగదు మాయం చేసేస్తారు. మీ వెనుకే ఉండి కార్డ్ నంబరు​ను కళ్లతోనే పసిగట్టేసి.. ఓటీపీని చాకచక్యంగా కొట్టేస్తారు. ఇదే తరహాలో విజయవాడ నగరంలో వరుస ఏటీఎం నేరాలకు పాల్పడుతున్న ఓ నేరస్థుణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

రమ్మీకి బాసిసై...ఏటీఎం నంబర్లలతో చోరీలు...!
author img

By

Published : Oct 10, 2019, 6:39 AM IST

Updated : Oct 10, 2019, 2:06 PM IST

రమ్మీ కోసం రాంగ్ ట్రాక్ పట్టాడు ఓ యువకుడు. సీఏ చదివినా... విలాసాలకు అలవాటుపడి పక్కదారిపట్టాడు. ఉద్యోగం చేసినా.. డబ్బు చాలకపోవటం వలన ఏటీఎం నేరాలకు పాల్పడ్డాడు. నెల్లూరుకు చెందిన మధుసూదన్ చెన్నైలో సీఏ చదువుకునే సమయంలో ఆన్లైన్​లో రమ్మీ ఆడేవాడు. ఆటలో రెండు లక్షల రూపాయల నగదు పోగొట్టుకున్నాడు. చెన్నై నుంచి నెల్లూరు వచ్చి తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటిలో ఉన్న నగదు, బంగారం మత్తూట్ ఫైనాన్స్​లో తాకట్టు పెట్టి ఆ నగదుతో ఆన్లైన్ రమ్మీ ఆడి పోగొట్టుకున్నాడు. ఆ విషయం తన తల్లిదండ్రులకు తెలియడం వలన 2019లో విజయవాడకు మకాం మార్చాడు. తన అన్నయ్య స్నేహితుడు దగ్గర సింగ్​నగర్​లో ఉంటూ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బాయ్​గా పని చేసేవాడు. ఉద్యోగం చేసి సంపాదించేదంతా.. రమ్మీ ఆటకే ఖర్చుపెట్టేవాడు. సంపాదన సరిపోక ఏటీఎం మిషన్ల వద్దకు నగదు డ్రా చేయడానికి వచ్చే వారిని లక్ష్యంగా చేసుకున్నాడు. పక్కా పథకం ప్రకారం ఖాతాలోని నగదు కాజేయడం మొదలుపెట్టాడు.

సాయం పేరిట మోసం

ఏటీఎం గురించి సరిగ్గా తెలియని వృద్ధులను లక్ష్యంగా చేసుకుని... వారికి సాయం చేస్తున్నట్లు నటిస్తూ కార్డ్ నంబరును తన ఫోన్లో నమోదు చేసుకునేవారు. కార్డు వెనుక ఉండే సీవీవీ నంబరును, కార్డు ముగింపు తేదీలు కాజేసి... రమ్మీ ఆన్లైన్లో ఎంటర్ చేసేవాడు. వారి ఫోన్​కు ఓటీపీ రాగానే దాన్ని చూసి తన ఫోన్లో నమోదు చేసి నగదు తన ఖాతాకు బదిలీ చేసుకునేవాడు. సత్యనారాయణపురం పీఎస్ పరిధిలో తన ఖాతా నుంచి నగదు మాయమైందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నగదు మళ్లించిన రమ్మీ ఖాతా ఆధారంగా నిందితుడి చిరునామా గుర్తించి.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇప్పటి వరకూ ఇలాంటి 7 నేరాలకు పాల్పడినట్లు నిందితుడి ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఒక కేసులో జైలుకూ వెళ్లొచ్చాడని దర్యాప్తులో తేలింది.

జాగ్రత్త వహించండి

ఏటీఎం కేంద్రాల్లో లావాదేవీలు జరుపుతున్నప్పుడు ఇతరులను గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు ఎవరకీ కనబడకుండా జాగ్రత్త పడాలన్నారు. ఎవరితోనూ ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డు వివరాలు మౌఖికంగా, ఫోన్​, మెయిల్ ద్వారా పంచుకోవద్దని పోలీసులు కోరుతున్నారు.

రమ్మీకి బానిసై...ఏటీఎం నంబర్లతో చోరీలు...!

ఇదీ చదవండి :

సైబర్​ మోసాల్లో పోయిన డబ్బు తిరిగి రావాలంటే...

Intro:Chittoor dt kanipaka vinayaka devastanam abhivrudipy jilla collector bharath Gupta aalaya adhikarulato samavesam nirvahimchar tirumala tarahalo abhivrudi chestamannaruBody:S.gurunathConclusion:Puthalapattu
Last Updated : Oct 10, 2019, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.