Atluri Rammohan Rao : రామోజీ గ్రూపు సంస్థలకు సుదీర్ఘకాలం ఎండీగా పనిచేసిన అట్లూరి రామ్మోహన్‌రావు (87) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. అట్లూరి రామ్మోహన్‌రావు 1936లో కృష్ణాజిల్లా పెదపారుపూడిలో జన్మించారు. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావుకు ఆయన సహాధ్యాయి, బాల్య స్నేహితులు. ఉపాధ్యాయుడిగా రామ్మోహన్‌రావు తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.
అనంతరం ఉపాధ్యాయ వృత్తిని వదిలి 1974లో ఈనాడులో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. 1978లో ఈనాడు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1982లో ఈనాడు ఎండీగా పదోన్నతి పొంది.. 1995వరకు ఆ పదవిలో కొనసాగారు. 1992 నుంచి ఫిల్మ్ సిటీ నిర్మాణ వ్యవహారాల్లో పాలు పంచుకున్నారు. 1995లో ఫిల్మ్‌సిటీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. రామోజీ గ్రూప్, ఈనాడు సంస్థల్లో సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో రామ్మోహన్‌రావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటించారు.
చంద్రబాబు సంతాపం: ఈనాడు దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ గా ఒక ప్రత్యేక ఒరవడిని తీర్చిదిద్ది, రామోజీ గ్రూప్ లోని పలు సంస్ధలకు ఎండీగా సుదీర్ఘకాలం సేవలందించిన రామ్మోహన్‌రావు గారి మరణం విచారకరం. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
-
ఈనాడు దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ గా ఒక ప్రత్యేక ఒరవడిని తీర్చిదిద్ది, రామోజీ గ్రూప్ లోని పలు సంస్ధలకు ఎండీగా సుదీర్ఘకాలం సేవలందించిన అట్లూరి రామ్మోహన్ రావ్ గారి మరణం విచారకరం. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic.twitter.com/jzltVjApCw
— N Chandrababu Naidu (@ncbn) October 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఈనాడు దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ గా ఒక ప్రత్యేక ఒరవడిని తీర్చిదిద్ది, రామోజీ గ్రూప్ లోని పలు సంస్ధలకు ఎండీగా సుదీర్ఘకాలం సేవలందించిన అట్లూరి రామ్మోహన్ రావ్ గారి మరణం విచారకరం. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic.twitter.com/jzltVjApCw
— N Chandrababu Naidu (@ncbn) October 22, 2022ఈనాడు దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ గా ఒక ప్రత్యేక ఒరవడిని తీర్చిదిద్ది, రామోజీ గ్రూప్ లోని పలు సంస్ధలకు ఎండీగా సుదీర్ఘకాలం సేవలందించిన అట్లూరి రామ్మోహన్ రావ్ గారి మరణం విచారకరం. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic.twitter.com/jzltVjApCw
— N Chandrababu Naidu (@ncbn) October 22, 2022
లోకేశ్ సంతాపం: అట్లూరి రామ్మోహన్‌రావు మృతిపట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. ఈనాడు సంస్థల్లో క్రమశిక్షణ, అంకితభావంతో దశాబ్దాలపాటు సేవలందించారని కొనియాడారు. రామ్మోహన్‌రావు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
-
రామోజీ ఫిల్మ్ సిటీ మాజీ ఎండీ అట్లూరి రామ్మోహన్‌రావు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. క్రమశిక్షణ, అంకితభావంతో దశాబ్దాలుగా ఈనాడు సంస్థలలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన రామ్మోహన్‌రావు గారి సేవలు చిరస్మరణీయం. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. pic.twitter.com/Zgnme3ujQW
— Lokesh Nara (@naralokesh) October 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">రామోజీ ఫిల్మ్ సిటీ మాజీ ఎండీ అట్లూరి రామ్మోహన్‌రావు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. క్రమశిక్షణ, అంకితభావంతో దశాబ్దాలుగా ఈనాడు సంస్థలలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన రామ్మోహన్‌రావు గారి సేవలు చిరస్మరణీయం. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. pic.twitter.com/Zgnme3ujQW
— Lokesh Nara (@naralokesh) October 22, 2022రామోజీ ఫిల్మ్ సిటీ మాజీ ఎండీ అట్లూరి రామ్మోహన్‌రావు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. క్రమశిక్షణ, అంకితభావంతో దశాబ్దాలుగా ఈనాడు సంస్థలలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన రామ్మోహన్‌రావు గారి సేవలు చిరస్మరణీయం. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. pic.twitter.com/Zgnme3ujQW
— Lokesh Nara (@naralokesh) October 22, 2022
అచ్చెన్నాయుడు సంతాపం: అట్లూరి రామ్మోహన్‌రావు మృతిపట్ల తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. రామోజీ గ్రూప్‌లో అంచెలంచెలుగా ఎదిగి సుదీర్ఘకాలం సేవలందించారని కొనియాడారు. అట్లూరి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సంతాపం ప్రకటించిన మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి
అట్లూరి రామ్మోహన్‌రావు మృతి పట్ల తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డిలు సంతాపం ప్రకటించారు. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించి, ఈనాడు వంటి ప్రతిష్టాత్మక సంస్థలో డైరక్టర్‌గా, ఎండీగా అట్లూరి రామ్మోహన్‌రావు విశిష్ట సేవలు అందించారని అన్నారు. ఫిల్మ్ సిటీ నిర్మాణంలో కీలకపాత్ర వహించి, ఎండీగా కూడా తన సేవలందించారని కొనియాడారు. రామ్మోహన్‌రావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించిన హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డిలు.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అట్లూరి రామ్మోహన్‌రావు మరణం బాధాకరం: బండి సంజయ్
రామోజీ గ్రూప్ సంస్థల ఎండీగా పనిచేసిన అట్లూరి రామ్మోహన్‌రావు మృతి పట్ల భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ సంతాపం తెలిపారు. ఆయన మరణం బాధాకరమన్నారు. ఫిల్మ్‌సిటీ నిర్మాణంలో ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. రామ్మోహన్‌రావు ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: