కృష్ణా జిల్లా కోడూరు మండలం, హంసలదీవి పాలకాయతిప్ప బీచ్ వద్ద... పౌర్ణమి నాడు భక్తుల సముద్ర స్నానాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సముద్రంలో కృష్ణానది కలిసే సాగర సంగమం వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందునా... ఆ ప్రాంతానికి భక్తులకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా హంసలదీవి వద్ద అధికారులు మరమ్మతు పనులను చేపట్టారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్కు ఆటంకం కలగకుండా 110 మంది పోలీసు, 40 మంది సచివాలయ మహిళ పోలీస్ సిబ్బందిని నియమించినట్లు అధికారులు పేర్కొన్నారు.
పౌర్ణమి రోజున భక్తుల స్నానాలకు హంసలదీవి వద్ద ఏర్పాట్లు
పౌర్ణమి నాడు భక్తులు సముద్ర స్నానాలు చేసేందుకు కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవి పాలకాయతిప్ప బీచ్ వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు చేపట్టారు.