ఆరు నెలలు కాకముందే ఆర్టీసీ ఎండీ స్థానం నుంచి తనను ప్రభుత్వం బదిలీ చేసినందుకు ఎలాంటి బాధ లేదని చెప్పారు మాదిరెడ్డి ప్రతాప్. బదిలీలపై ముఖ్యమంత్రి చాలా రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. సీఎం తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించే స్థాయిలో తాను లేనని వ్యాఖ్యానించారు. ఆర్టీసీలో అక్రమాలు చేశారంటూ తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన చెప్పారు.
ఐపీఎస్‌గా నా సుదీర్ఘ సర్వీసులో ఎంతో నిబద్ధతతో వ్యవహరించా. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనూ కార్యదర్శిగా పనిచేశాను. రచ్చబండ కార్యక్రమానికి వైఎస్ఆర్తో పాటు నన్ను కూడా వెళ్లమని ఓ అధికారి కోరారు. కొన్నికారణాలతో చివరకు నేను వెళ్లలేదు. దీనివల్ల నాకు పునర్జన్మ దక్కింది. వైఎస్ మరణానంతరం జగన్‌పై రాజకీయంగా సీబీఐ విచారణ చేశారు. ఆ సమయంలో పలువురు ఉన్నతాధికారులను సీబీఐ విచారించినా.. నన్ను కనీసం అనుమానించలేదు.
అభిబస్‌తో ఆర్టీసీ కుదుర్చుకున్న ఒప్పందంలో ఎక్కడా అక్రమాలు లేవు. అభిబస్‌తో ఆన్లైన్ టికెట్ జారీ కోసం ఆర్టీసీ ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు. మొబైల్ ద్వారా ఒక టికెట్ జారీకి ప్రస్తుతం 16 పైసలు ఇస్తుండగా.. దానిని 15 పైసలకు నిర్ణయించాం. సాధారణ రోజుల్లో ఆర్టీసీ రోజుకు 31లక్షల టికెట్లు జారీ చేస్తుండగా... రోజుకు మినిమం గ్యారెంటీగా 1.5 లక్షల టికెట్లకు డబ్బు చెల్లించేలా అభిబస్‌తో ఒప్పందం చేసుకున్నాం. కరోనా అనంతరం పరిస్థితులు చక్కబడ్డాకే ఆ సంస్థకు ఈ మేరకు చెల్లింపులు చేసేలా ఒప్పందం చేసుకున్నాం- మాదిరెడ్డి ప్రతాప్, ఆర్టీసీ ఎండీ
ఇదీ చదవండి