శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు సముద్రపు ఒడ్డున అత్యధిక ఖనిజాలు ఉండే బీచ్ శాండ్ లీజుల కోసం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) రాష్ట్ర గనులశాఖ ద్వారా ప్రయత్నాలు చేస్తోంది. నల్లగా ఉండే ఈ ఇసుకను బీచ్ శాండ్‌గా పేర్కొంటారు. ఈ నిల్వలున్న ప్రాంతాన్ని 18 లీజులుగా కేటాయించాలని ఏపీఎండీసీ రాష్ట్ర గనుల శాఖ ద్వారా కేంద్రానికి ప్రతిపాదించింది. కేంద్ర గనులశాఖ అణు ఇంధన శాఖను సంప్రదించాలని బదులిచ్చింది. లీజు ప్రతిపాదనలతో అణు ఇంధనశాఖను ఇటీవల మైనింగ్ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఏపీఎండీసీకి తొలుత శ్రీకాకుళం జిల్లా రణస్థలం, ఎచ్చెర్ల మండలాల్లో 3,300 హెక్టార్ల పరిధిలో మూడు లీజులను కేంద్ర గనులశాఖ మంజూరు చేసింది. వీటిలో 21.5 మిలియన్ టన్నుల ఖనిజ నిల్వలున్నట్లు అంచనా. లీజు తర్వాతి ప్రక్రియను పూర్తి చేయలేకపోవడంతో అవి రద్దయ్యాయి. కొత్త నిబంధనల ప్రకారం ప్రభుత్వ అనుబంధ సంస్థలకు మాత్రమే బీచ్ శాండ్ లీజులు ఇవ్వనున్నారు. అందుకే 18 లీజుల రూపంలో మొత్తం ఆరు జిల్లాల పరిధిలోని ప్రాంతాన్ని తమకు రిజర్వ్ చేయాలని ఏపీఎండీసీ ప్రతిపాదిస్తోంది.
ఇదీ చూడండి. భవన నిర్మాణాల్లో ఈసీబీసీ అమలుచేయాలి