రాష్ట్రంలో సమగ్ర సర్వే చేయించి భూ యజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కల్పించాలని... సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని సర్వే ఎంప్లాయిస్ అసోసియేషన్ బాధ్యులు రమణా రెడ్డి అన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన ప్రభుత్వ భూములు పరిరక్షింపబడతాయని పేర్కొన్నారు. సర్వే కారణంగా భూముల సరిహద్దులు, వివాదాలు పరిష్కరించే వీలు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. సర్వే శాఖను పటిష్ఠం చేయాలని సర్వేయర్లు కోరారు.
ఇదీ చదవండీ...