ETV Bharat / state

భద్రత కల్పించే విషయంలో నిబంధనలేంటి? - taja news of ap high court

మాజీ మంత్రి సి.ఆదినారాయణరెడ్డికి భద్రత కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటో తెలియచేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. భద్రత ఖర్చంతా పిటిషనర్ భరిస్తానన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయటంలేదని ధర్మాసనం ప్రశ్నించింది.

ap high court qustioned state govt about ex minister adinayaran reddy z plus security issue

author img

By

Published : Jul 15, 2020, 9:19 AM IST

మాజీ మంత్రి సి.ఆదినారాయణరెడ్డికి భద్రత కల్పించే విషయంలో వివరాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిబంధనలేంటో చెప్పాలని స్పష్టం చేసింది. భద్రతకయ్యే ఖర్చు పిటిషనర్‌ భరిస్తానన్నపుడు 1+1 భద్రత కల్పించడంలో ఇబ్బంది ఏమిటో తెలపాలని సూచిస్తూ విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది.

ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ కె.లలితలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. భద్రతను ఉపసంహరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆదినారాయణరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్‌ జడ్జి తోసిపుచ్చారు. దీంతో ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు.

ఇదీ చూడండి

'కరోనా బాధితులకు వైద్యం నిరాకరిస్తే.... ఆస్పత్రి అనుమతి రద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.