సామాజిక మాధ్యమాల్లో న్యాయవ్యవస్థ, న్యాయ మూర్తులపై అభ్యంతరకర పోస్టులు, వీడియోలను తొలగించే వ్యవహారంలో సామాజిక మాధ్యమ సంస్థలు న్యాయస్థానంతో దోబూచులాడుతున్నాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అభ్యంతరకర యూఆర్ఎల్ లను(యూనిఫాం రిసోర్స్ లొకేటర్) తొలగించాలని సీబీఐ కోరితే 36 గంటల్లో ఎందుకు తొలగించలేదని ట్విటర్, యూట్యూబ్, ఫేస్బుక్ తదితర సామాజిక మాద్యమ కంపెనీలపై మండిపడింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలకు వక్రభాష్యం చెబుతున్నాయని, సరైన స్పూర్తితో అమలు చేయడం లేదని ఆక్షేపించింది. ఫలానా పోస్టులు తొలగించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జన రల్(ఆర్బీ) లేదా కేసులను దర్యాప్తు చేస్తున్న సీబీఐ కోరితే తొలగించాల్సిం దేనని తేల్చిచెప్పింది. కొన్ని యూఆర్ఎల్లను తొలగించలేదని సీబీఐ, తాల గించామని సామాజిక మాధ్యమ సంస్థలు చెబుతున్న నేపథ్యంలో ఈ పెద్ద రిలో ఎవరైనా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే తీవ్ర పరిణా మాలుంటాయని హెచ్చరించింది. కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభిస్తామని తేల్చిచెప్పింది. ఎన్ని యూఆర్ఎల్లను తొలగించాలని కోరారో ఆ వివరాలను సామాజిక మాధ్యమాలకు ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. ఎన్ని తొలగిం చారు. మిగిలినవి తొలగింపునకు ఏమి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ అఫిడవిట్ వేయాలని ట్విటర్, యూట్యూబ్, ఫేస్బుక్లను ఆదేశించింది. విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. న్యాయవ్యవస్థ, న్యాయ మూర్తులను దూషిస్తూ, అపకీర్తిపాట్టేసే రీతిలో పోస్టులు పెట్టిన వ్యవహా రంపై హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.
పంచ్ ప్రభాకర్పై అభియోగపత్రం వేస్తాం: సీబీఐ
మంగళవారం జరిగిన విచారణలో సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్(ఏఎస్బీ) ఎన్వీ రాజు వాదనలు వినిపించారు. దర్యాప్తు పురోగతిపై నివేదికను కోర్టు ముందు ఉంచారు. ఇప్పటికే 16 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. 17వ నిందితుడిగా పంచ్ ప్రభాకర్ను చేర్చామని 11 మందిని అరెస్ట్ చేసి అభియోగపత్రం వేశామని మిగిలిన వారు విదేశాల్లో ఉన్నార న్నారు. పంచ ప్రభాకర్ విషయంలో కేంద్రం నుంచి అనుమతి రాగానే అవి యోగపత్రం వేస్తామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. విదేశాల్లో ఉన్నవారిని పరారీలో ఉన్నట్లు ప్రకటించి అభియోగపత్రం వేయాలని సూచించింది.
ఇదీ చదవండి : Marijuana gang : విశాఖలో గంజాయి ముఠా బీభత్సం..కారును వదిలి, చెరువులోకి దూకి..
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం