నరేగా పెండింగ్ బిల్లులపై(Pending MGNREGS bills news) దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు(ap high court)లో విచారణ జరిగింది. ఇందుకు ఐఏఎస్‌లు ఎస్.ఎస్.రావత్, గిరిజాశంకర్, జి.కె. ద్వివేది హాజరయ్యారు.60 శాతం పనులకు డబ్బు చెల్లించామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇంకా 40 శాతం పనులకు చెల్లించాల్సి ఉందని వివరించింది. రాష్ట్రం ఈ నెల 18న రూ.400 కోట్ల ప్రతిపాదనలు పంపిందని కేంద్ర ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. రాష్ట్ర ప్రతిపాదనలు పరిశీలించి ఈ నెలాఖరులోగా చెల్లిస్తామని కోర్టుకు తెలిపారు.
ఇదీ చదవండి
సీఎం వద్దకు ముండ్లమూరు ఎంపీపీ వివాదం.. ఎమ్మెల్యే వేణు వర్గానికే పదవి