ప్రధాని కేర్స్ నిధికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నెల జీతం విరాళం ఇచ్చారు. సీఎం సహాయ నిధికి కరోనా సహాయ చర్యల కోసం రూ.లక్ష విరాళం ప్రకటించారు. ప్రజలు, దాతలు ఉదారంగా విరాళాలు అందించి కరోనా వ్యాప్తి నివారణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రమాదకరంగా పరిణమించిన కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రజలంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ.. స్వీయ నిర్బంధంలో క్రమశిక్షణతో మెలగాలని చెప్పారు. విదేశీ ప్రయాణికులు స్వచ్ఛందంగా ఆరోగ్య పరీక్షలకు ముందుకు రావాలని కోరారు. వృద్ధులు, పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సహాయం అందించాలి
ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, రెడ్‌క్రాస్, ఎన్జీఓలు, పౌరసమాజం సభ్యులు, యువజన సంస్థలు కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలు, కూలీలు, వలస కార్మికులు ఇబ్బందులు పడుతున్నందున వారికి అవసరమైన సామగ్రి ఉచితంగా పంపిణీ చేయాల్సిందిగా రెడ్‌క్రాస్ సొసైటీ అధికారులకు సూచించినట్లు గవర్నర్ తెలిపారు.
ఇదీ చూడండి:
'ప్రతి జిల్లాలో 5 వేల బెడ్స్‌తో ఐసోలేషన్, క్వారంటైన్ కేంద్రాలు'