ETV Bharat / state

అవినీతి అంతం... అందరి బాధ్యత: సీఎం జగన్ - spandana progaram

అవినీతిని అంతమొందిచాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. సమష్టి కృషితోనే అది సాధ్యమవుతుందని చెప్పారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
author img

By

Published : Jul 10, 2019, 1:13 PM IST

Updated : Jul 10, 2019, 1:40 PM IST

కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం స్పందనకు వచ్చిన ఫిర్యాదులపై సీఎం సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వందల సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులపై సకాలంలో స్పందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు.

అధికారులకు సీఎం దిశానిర్దేశం

మండల స్థాయి నుంచి అవినీతిని అరికట్టాలని సీఎం సూచించారు. మీ-సేవాలో సర్టిఫికెట్ల జారీ వేగవంతం చేయాలన్నారు. లంచం ఇస్తే గానీ పనికావట్లేదనే ఫిర్యాదులు అందకూడదని అధికారులతో చెప్పారు. కిందిస్థాయి అధికారులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి... అవినీతికి పాల్పడకుండా చేయాలని అన్నారు. సీఎం కార్యాలయం నుంచి మండలస్థాయి వరకూ అవినీతిరహిత పాలన అందించే ప్రయత్నం జరగాలని తెలిపారు.

రెండు, మూడు నెలల్లో...

వచ్చే 2-3 నెలల్లో పాజిటివ్ రిపోర్టు రావాలని జగన్‌ అధికారులకు సూచించారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏ పనిచేసుకోవాలన్నా డబ్బు లేనిదే పని జరగట్లేదన్న విషయంపై అధికారులతో సీఎం చర్చించారు. ఈ సమస్య పరిష్కారానికి కలెక్టర్లు సలహాలు ఇవ్వాలని చెప్పారు. వ్యవస్థలో కచ్చితంగా మార్పురావాలని అన్నారు. అవినీతిని అరికట్టడానికి తనవంతు సాయం ఉంటుందన్న సీఎం... మిగిలిన ప్రయత్నం కలెక్టర్లు చేయాలని చెప్పారు.

ఇదీ చదవండి : ఉద్యోగాల నియామక ప్రక్రియ వేగవంతం-సిలబస్‌పై తర్జనభర్జన

Intro:AP_GNT_26a_10_CM_HOUSE_NIGHT_DHARNA_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

Body:script

Conclusion:FTP lo vachindi
Last Updated : Jul 10, 2019, 1:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.