ఆంధ్రప్రదేశ్ భాజపా ఎన్నికల మేనిఫెస్టోను విజయవాడలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆవిష్కరించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు సునీల్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉంటుందని పీయూష్ స్పష్టం చేశారు. అన్నివర్గాల వారికి ఉపయోగపడేలా మేనిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు. పూర్తి వివరాలను ఆన్లైన్లో అందుబాటులో పెడతామని చెప్పారు.భాజపా మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు, కామినేని, జీవీఎల్ నరసింహారావు, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్సీ మాధవ్ తదితరులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి:అనుమతి లేనిదే ఏది అప్‌లోడ్ చేయొద్దు...!